బిజినెస్

స్వల్ప లాభాల్లో మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 9: దేశీయ సంస్థాగత మదుపరుల నుంచి లభించిన మద్దతుతో స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు సెనె్సక్స్, నిఫ్టీ సోమవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. గత వారం భేటీ అయిన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) మండలి ఎగుమతిదారులను ప్రోత్సహించడంతో పాటు చిన్న, మధ్య తరహా వ్యాపారుల పట్ల సానుకూలంగా స్పందిస్తూ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీల పనితీరుకు సంబంధించిన ఫలితాలు వెలువడటం ఈ వారం ప్రారంభం కావడంతో మదుపరులు ఆచితూచి అడుగులు వేశారు.
దీంతో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బిఎస్‌ఇ) సెనె్సక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఇ) నిఫ్టీలు ఈ వారం తొలి రోజయిన సోమవారం పెద్దగా లాభాలను ఆర్జించలేకపోయాయి. 30 షేర్లతో కూడిన సెనె్సక్స్ ఒక దశలో 31,935.63 పాయింట్లతో గరిష్ఠ స్థాయికి చేరుకున్నప్పటికీ, చివరలో పడిపోయి కేవలం 32.67 పాయింట్ల (0.10 శాతం) లాభంతో 31,846.89 వద్ద ముగిసింది. మదుపరులు లాభాలను ఆర్జించడానికి హడావుడి పడటం అనేక షేర్ల విక్రయానికి దారితీసింది. సెనె్సక్స్ శుక్రవారం 222 పాయింట్లు పెరిగిన విషయం తెలిసిందే.
50 షేర్లతో కూడిన ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ సోమవారం కీలకమైన పది వేల మార్కును చేరుకున్నప్పటికీ తరువాత పడిపోయి కేవలం 9.05 పాయింట్ల (0.09 శాతం) లాభంతో 9,988.75 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రా డేలో ఒక దశలో 9,959.45 పాయింట్ల కనిష్ట స్థాయికి కూడా పడిపోయింది. అయితే ఆ తరువాత కోలుకుంది. సోమవారం నిఫ్టీ స్మాల్‌క్యాప్ సూచీ 0.32 శాతం లాభంతో, నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 0.02 శాతం నష్టంతో ముగిసింది.
రంగాల వారీగా చూసినప్పుడు ఎన్‌ఎస్‌ఇలో మూడు రంగాలు మినహా మిగతా రంగాల సూచీలు లాభపడ్డాయి. నిఫ్టీ రియల్టీ, మీడియా, ఎఫ్‌ఎంసిజి సూచీలు అత్యధికంగా లాభాలను ఆర్జించాయి. ఈ మూడు రంగాల సూచీలు వరుసగా 2.33 శాతం, 1.06 శాతం, 0.62 శాతం చొప్పున లాభపడ్డాయి. నష్టపోయిన రంగాలలో నిఫ్టీ ఎనర్జీ, ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆటోరంగ సూచీలు ఉన్నాయి. ఈ మూడు సూచీలు వరుసగా 0.95 శాతం, 0.04 శాతం, 0.01 శాతం చొప్పున నష్టపోయాయి. ప్రధానంగా లాభపడిన పడిన వాటిలో కోల్ ఇండియా, టెక్ మహీంద్రా, యెస్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీ, అదాని పోర్ట్స్ ఉన్నాయి. నష్టపోయిన వాటిలో ఆరో ఫార్మా, పవర్ గ్రిడ్, ఒఎన్‌జిసి, బిపిసిఎల్, గెయిల్ ఉన్నాయి. ఎన్‌ఎస్‌ఇలో 987 షేర్లు లాభపడగా, 757 షేర్లు నష్టపోయాయి. 64 షేర్ల ధరల్లో ఎలాంటి మార్పు సంభవించలేదు.