బిజినెస్

నిజామాబాద్‌లో ఐటి హబ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, అక్టోబర్ 9: నిజామాబాద్‌లో ఐ.టి హబ్ ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సంబంధిత శాఖా మంత్రి కెటిఆర్ సోమవారం ఈ ఉత్తర్వులను నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తాలకు అందజేశారు. ఇటీవల ఆర్మూర్ జిల్లా పర్యటనకు కెటిఆర్ హాజరైన సందర్భంగా, స్థానికంగా ఐ.టి హబ్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా ఎంపి కవిత కోరడంతో ఆయన హామీ ఇచ్చారు. ఆ హామీకి కట్టుబడి తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఐ.టి హబ్ ఏర్పాటుతో యువతకు స్థానికంగానే విరివిగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేందుకు మార్గం సుగమమైంది. ఇప్పటికే అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా దాదాపు 60 కంపెనీలతో ఒప్పందం కుదిరేలా తనవంతు ప్రయత్నాలు సాగించారు. దీంతో నిజామాబాద్‌లో నెలకొల్పనున్న ఐ.టి హబ్ ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కీలకంగా నిలుస్తుందని భావిస్తున్నారు. సుమారు 50కోట్ల రూపాయల నిధులతో 50వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐ.టి హబ్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. అంతేకాకుండా హైదరాబాద్ తరహాలో 10వేల చదరపు అడుగులతో ఇంక్యుబేటర్‌ను కూడా నిర్మించనున్నట్టు ఎంపి, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. కాగా, ఐ.టి హబ్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ అయిన నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా చూడాలని మంత్రి కెటిఆర్ జిల్లా ప్రజాప్రతినిధులకు సూచించారు. అలాగే నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులకు సంబంధించి సాధ్యమైనంత త్వరగా ప్రతిపాదనలు రూపొందించాలని స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. ప్రతిపాదనలు అందిన వెంటనే నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

చిత్రం..ఐటి హబ్ ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వులను ఎంపి కవిత,
ఎమ్మెల్యే బిగాలకు అందజేస్తున్న మంత్రి కెటిఆర్