బిజినెస్

శ్రీసిటీలో ప్రత్యేకంగా జపాన్ ఎన్‌క్లేవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరదయ్యపాళెం, అక్టోబర్ 9: శ్రీసిటీ సెజ్‌ను సోమవారం జపాన్ దేశానికి చెందిన 21మందితో కూడిన పారిశ్రామిక వేత్తల బృందం సందర్శించింది. వీరికి శ్రీసిటీ ఎండి రవీంద్రసన్నారెడ్డి స్వాగతం పలికి రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం, ప్రభుత్వం అందిస్తున్న పలు ప్రోత్సాహకాలను తెలియజేస్తూ శ్రీసిటీ ప్రత్యేకతలు, వౌలిక వసతుల గురించి వివరించారు. ఈ సందర్భంగా శ్రీసిటీ ఎండి రవీంద్రసన్నారెడ్డి మాట్లాడుతూ జపాన్ పరిశ్రమల యాజమాన్యాల సౌకర్యార్థం శ్రీసిటీలో ప్రత్యేక జపాన్ ఎన్‌క్లేవ్‌లను ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే జపాన్ దేశానికి చెందిన 20 పరిశ్రమలు ఏర్పాటయ్యాయని, జపాన్ పారిశ్రామిక వేత్తల బృందం శ్రీసిటీని సందర్శించడం వలన మరిన్ని పరిశ్రమలు ఇక్కడ స్థాపించే అవకాశం ఉన్నదని తెలిపారు. అనంతరం జపాన్ దేశానికి చెందిన ప్రముఖ వ్యాపార ప్రకటనల కంపెనీ నికాన్ కాగ్యో, షింబన్ ప్రెసిడెంట్ హరిహిటోఇమిజు మాట్లాడుతూ శ్రీసిటీలోని వౌలిక వసతులు, వ్యాపార సామర్థ్యానికి అవసరమయ్యే పెట్టుబడుల అవకాశాన్ని అనే్వషించడానికి శ్రీసిటీలో పర్యటిస్తున్నామని, శ్రీసిటీ ప్రపంచ స్థాయి వౌలిక వసతులు, స్నేహపూర్వక వాతావరణం పట్ల తమబృంద సభ్యులు ఎంతో సంతృప్తి చెందారని తెలిపారు. రెండేళ్లక్రితం తాను శ్రీసిటీకి వచ్చానని, అప్పటికే శ్రీసిటీ అభివృద్ధిలో దూసుకుపోతున్నదని ఈసందర్భంగా ఆయన పేర్కొన్నారు. అనంతరం శ్రీసిటీ ఎండి రవీంద్రసన్నారెడ్డి శ్రీసిటీలోని పలు జపాన్ పారిశ్రామిక సంస్థల ఉన్నతాధికారులతో వ్యాపార అనుకూలతలపై చర్చలు జరిపారు.

చిత్రం..శ్రీసిటీని సందర్శించిన జపాన్‌దేశ పారిశ్రామికవేత్తల బృందం