బిజినెస్

వ్యాపార అనుకూలతలో తెలంగాణ నెంబర్‌వన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 9: వ్యాపార సరళీకరణ (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్-ఇఓబిడి) 2016లో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. కొత్తపరిశ్రమలకు సంబంధించి అనుమతులను నిర్ణీత గడువులోగా ఇస్తున్నారు. రెడ్ క్యాటగిరిలో 21 రోజులు, ఆరెంజ్ క్యాటగిరిలో 14 రోజులు, గ్రీన్ క్యాకగిరిలో 7 రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇస్తోందని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నివారణ మండలి ప్రకటించింది. అటవీ, పర్యావరణ శాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్ రజత్ కుమార్ నేతృత్వంలో ఇఓబిడిపై సోమవారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి వివిధ అనుమతుల కోసం దరఖాస్తులను ఆన్‌లైన్‌లో మాత్రమే చేయాల్సి ఉంటుందని రజత్ కుమార్ తెలిపారు. పారిశ్రామిక వేత్తలకు చేయూత ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టిందని గుర్తుచేశారు.