బిజినెస్

ఏపి డిజిటల్ అభివృద్ధికి థామ్సన్ రాయటర్స్‌తో ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 9: ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ అభివృద్ధి నిమిత్తం రెండు వ్యూహాత్మక కార్యక్రమాలు అమలు చేసేందుకు ఎపి ప్రభుత్వం థామ్సన్ రాయటర్స్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖ నగరంలో రెండు రోజులపాటు జరిగే బ్లాక్‌చైన్ టెక్నాలజీ ప్రారంభం సందర్భంగా సోమవారం ఈమేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు థామ్సస్ రాయటర్స్ దక్షిణాసియా మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ లంకపల్లి తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటి శాఖా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ డిజిటల్ ఆవిష్కరణల్లో ఆంధ్రప్రదేశ్ ముందుందన్నారు. ఫిన్‌టెక్ వ్యాలీ ద్వారా రాష్ట్రంలో ఫిన్‌టెక్ ఆవిష్కరణ సంస్కృతిని ప్రభుత్వం పెంపొందిస్తోందన్నారు. వైజాగ్ ఫిన్‌టెక్ వ్యాలీని గ్లోబల్ ఫిన్‌టెక్ వ్యాలీగా అభివృద్ధి చేయాల్సి ఉందని, దీనికోసం స్టార్టప్స్ ఫిన్‌టెక్ ఎకో సిస్టమ్ వృద్ధి చేయడంతోపాటు ఆర్థిక సంస్థలు, టెక్నాలజీ వెండార్లు, ఇంకుబేటర్లు, యాక్సలరేటర్లు, ఇన్నోవేషన్ ల్యాబ్స్ ఏర్పాటు ద్వారా ఇనె్వస్టర్లకు తోడ్పాటును అందించేందుకు తగిన అవకాశం కల్పిస్తుందన్నారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఇన్నోవేషన్ యాప్ స్టూడియో, డిజిటల్ కంటెంట్ ఎక్స్ఛేంజ్‌ను థామ్సన్ రాయటర్స్, గీతం యూనివర్శిటీతో కలిసి ప్రారంభించడం అభినందించదగ్గ పరిణామంగా పేర్కొన్నారు.