బిజినెస్

స్వదేశీ దర్శన్‌తో పర్యాటక శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, అక్టోబర్ 10: కేంద్ర ప్రభుత్వ స్వదేశీ దర్శన్, ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం ద్వారా పర్యాటక రంగాభివృద్ధికి ప్రభుత్వ యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. 2017 డిసెంబరులో కాకినాడ బీచ్ ఫెస్టివల్‌ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనుంది. అలాగే ప్రఖ్యాతిగాంచిన కోరంగి అభయారణ్యం అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు హోప్ ఐలాండ్, కాకినాడ బీచ్ అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తిచేయాలని నిర్ణయించింది. దీంతో తూర్పు గోదావరి జిల్లాలోని కోరంగి అభయారణ్యంలో అభివృద్ధి కార్యక్రమాలు జోరందుకోనున్నాయి. ప్రస్తుతం కోరంగిలో రూ.5.50 కోట్లతో ఇంటర్‌ప్రెటేషన్ సెంటర్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సెంటర్‌లో ఆడియో విజువల్ రూం, ఎగ్జిబిషన్ హాల్ తదితర సౌకర్యాలు కల్పించనున్నారు. సందర్శకుల నుండి వచ్చే ఎంట్రీ ఫీజు, పార్కింగ్ ఫీజులో కొంతమేర ఈ సెంటర్ నిర్వహణకు వినియోగించనున్నారు. కోరంగిలో పర్యాటకులు, పరిశోధకుల కోసం అదనంగా రెండు ప్రత్యేక స్పీడు బోట్లు కొనుగోలు చేయనున్నారు. కోరంగి అభయారణ్యంలో అరుదైన పక్షులు, జంతుజాలాన్ని వీక్షించడానికి, మడ అడవుల్లో పరిశోధనలకు వచ్చే పరిశోధకులకు వసతి సౌకర్యాలు ఏర్పాటుచేస్తున్నారు. అలాగే స్వదేశీ దర్శన్ పథకం కింద కాకినాడ ఎన్టీఆర్ బీచ్‌లో అభివృద్ధి కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఈ ఏడాది డిసెంబరులో ఇక్కడ బీచ్ ఫెస్టివల్-2017ను నిర్వహించనున్నారు. ఫెస్టివల్ నాటికి స్వదేశీ దర్శన్ కింద నిర్మిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది.