బిజినెస్

ఏపి సిఎంతో సింగపూర్, తైవాన్ ప్రతినిధుల భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 10: వెలగపూడి సచివాలయంలో సింగపూర్, తైవాన్‌కు చెందిన వ్యాపార ప్రముఖులతో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సమావేశమయ్యారు. గతంలో సింగపూర్ నేషనల్ వర్సిటీ, కనె్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ మధ్య జరిగిన ఒప్పందాన్ని పొడిగించేందుకు సిఎం అంగీకరించారు. దేశంలోని 21 రాష్ట్రాల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్‌కు సంబంధించి చేసిన అధ్యయనాన్ని సుర్బానా జుర్‌బాంగ్ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి వివరించారు. ఈ అధ్యయనం ఆధారంగా వివిధ బిజినెస్ మోడల్స్, పెట్టుబడిదారులు, పోటీదారులను ఆకట్టుకునే అంశాలతో రూపొందించిన పుస్తకాన్ని త్వరలో ఆవిష్కరించనున్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ సింగపూర్‌కు చెందిన నైపుణ్యం తమకు కావాలన్నారు. ప్రజలకు సంబంధించిన వివిధ విధానాల రూపకల్పన, సామర్థ్యం పెంపు వంటి అంశాల్లో అధికార యంత్రాంగానికి శిక్షణ ఇవ్వాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారానికి రియల్ టైమ్ గవరెన్సును ఇప్పటికే ఉపయోగిస్తున్నామని, ఈ మేరకు వివరాలను సిఎం తెలిపారు. సిఎం చేసిన ప్రజంటేషన్‌కు ముగ్ధులైన ఆ రెండు దేశాల వ్యాపార ప్రతినిధులు, అధికారులు పరిపాలనలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు ప్రచారం కల్పిస్తామని తెలిపారు. సిఎం దార్శనికతకు అనుగుణంగా రాష్ట్భ్రావృద్ధికి కలిసి పనిచేస్తామన్నారు.