బిజినెస్

బొగ్గుగని కార్మికుల వేతన ఒప్పందం ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, అక్టోబర్ 10: బొగ్గుగని కార్మికుల పదవ వేతన ఒప్పందం మంగళవారం ఖరారైంది. ఢిల్లీలో జరిగిన జెబిసిసి సమావేశంలో కోల్ ఇండియా యాజమాన్యానికి, జాతీయ కార్మిక సంఘాల మధ్య జరిగిన చర్చలో వేతన ఒప్పందం కుదిరింది. దీంతో బొగ్గుగనుల్లో పనిచేస్తున్న కార్మికులకు 2016 నుంచి రావాల్సిన వేతనాల నుంచి రూ.40వేలను దీపావళి పండుగకు వేజ్‌బోర్డు అలవెన్సులను అడ్వాన్సుగా చెల్లించేందుకు నిర్ణయించారు. గత ఏడాది కాలంగా కోల్‌కత్తా, రాంచీల్లో జరిగిన వేతన ఒప్పందం సమావేశాలు విఫలమైనప్పటికీ ఢిల్లీలో జరిగిన చర్చల్లో వేతన ఒప్పందం ఖరారు కావటంతో కార్మికులు హర్షం ప్రకటిస్తున్నారు. వేతన ఒప్పందం వివరాలను సిఐటియు ప్రధాన కార్యదర్శి మంద నర్శింహారావు, ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్యలు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. డిపెండెంట్ ఎంప్లాయ్‌మెంటు విధానం పాత పద్దతిలోనే కొనసాగుతుందని తెలిపారు.