బిజినెస్

సంస్కరణలతో వృద్ధికి ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: గత మూడు సంవత్సరాలుగా భారత ప్రభుత్వం అత్యంత సాహసోపేతంగా అమలుచేస్తున్న ఆర్థిక సంస్కరణల కారణంగానే అంతర్జాతీయ మార్కెట్‌లో భారత్ చాలా బలంగా నిలబడిందని ఒపెక్ సెక్రటరీ జనరల్ మహమ్మద్ బార్కిండో అన్నారు. ముఖ్యంగా ఈ ఆర్థిక సంస్కరణల వల్ల వ్యవస్థాగతమైన గుణాత్మక మార్పులు సాకారమయ్యాయని, భారత్ బలమైన వృద్ధిని సాధించేందుకు ఇవి విశేషంగా దోహదం చేస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఇండియా ఎనర్జీ ఫోరం సమావేశంలో మాట్లాడిన ఆయన భారతదేశంలో మధ్యతరగతి మార్కెట్ ఎప్పటికప్పుడు విస్తరిస్తోందని, కేవలం ఇంధన రంగానికి మాత్రమే సంబంధించి కాకుండా ఇతర వస్తు సేవల రంగాలకు కూడా ఎంతో ఆదరణ ఉందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో ఈ సాహసోపేత సంస్కరణల అమలు నిరాటంకంగా సాగుతోందని వెల్లడించిన ఆయన ఇంధన రంగంలో ఈ సానుకూల పరిణామం మరింత స్పష్టంగా ప్రస్ఫుటమవుతోందని తెలిపారు. ముఖ్యంగా సుస్థిర వృద్ధిపథాన్ని కొనసాగించడంతో పాటు మరిన్ని సంస్కరణల ద్వారా వేగాన్నీ పెంచడం అభివృద్ధికి దోహదం చేసేదే అవుతుందని అన్నారు. వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) సహా పెద్దనోట్ల రద్దు వంటి అనేక నిర్ణయాలు గతంలో ఎన్నడూ లేని విధంగా భారత ఆర్థిక వ్యవస్థను నిలకడైన వృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తున్నాయని తెలిపారు. రవాణా రంగంలో బలమైన వృద్ధి కనిపిస్తోందని, అలాగే వస్తు సేవల ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఐ.టి. రంగం విస్తరణ బలమైన తయారీ రంగ పునాది ఇవన్నీ కూడా భారతదేశం అంతర్జాతీయంగా తన ఉనికిని చాటుకునేందుకు, వృద్ధిని వేగవంతం చేసుకునేందుకు తోడ్పడ్డాయన్నారు. భారతదేశంలో చోటుచేసుకుంటున్న ఈ స్థూల ఆర్థిక పరిణామాలపై ఒపెక్ దేశాలు దృష్టిపెట్టాయని ఎప్పటికప్పుడు వ్యాపారానుకూల పరిస్థితులను కూడా గమనిస్తున్నాయని ఆయన అన్నారు. 2040 నాటికి భారత చమురు డిమాండ్ 150 శాతం పెరిగే అవకాశం ఉందని, అంటే రోజుకు అప్పటికి 10.1 మిలియన్ బ్యారెళ్ల చమురు అవసరమవుతుందని ఒపెక్ సెక్రటరీ జనరల్ అంచనా వేశారు.