బిజినెస్

మూడో రోజూ అదే జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుసగా మూడో రోజు కూడా స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. రానున్న రోజుల్లో కార్పొరేట్ ఆదాయ ఫలితాలు ఆశాజనకంగా ఉండే అవకాశం ఉందన్న కథనాలు మంగళవారం మార్కెట్‌కు మరింత ఊతాన్నిచ్చాయి. ఇటు సెనె్సక్స్, అటు నిఫ్టీ కూడా నేటి లావాదేవీలతో కొత్త శక్తిని సంతరించుకున్నాయి. సెనె్సక్స్ ఏకంగా మూడు వారాల్లో ఎన్నడూ లేనంతగా 77.52 పాయింట్లు పుంజుకుని 31,924.41 పాయింట్లకు చేరుకుంది. నిఫ్టీ కూడా 28.20 పాయింట్లు పెరిగి 10,016.95కు చేరింది. నేటి లావాదేవీల్లో ఇనె్వస్టర్లు క్రియాశీలకంగా వ్యవహరించారు. జూలై-సెప్టెంబర్‌కు సంబంధించిన త్రైమాసిక ఫలితాలు గురువారం నాడు టాటా కన్సల్టెన్సీతో మొదలు కానున్నాయి. అనంతరం రిలయన్స్ ఇండస్ట్రీస్ తన ఫలితాలను వెల్లడించబోతోంది. నేటి మార్కెట్ లావాదేవీలకు ఫార్మా కంపెనీలు సారథ్యం వహించాయి. అలాగే చమురు, సహజవాయువు, బ్యాంకింగ్ షేర్లు కూడా పుంజుకున్నాయి. జిఎస్‌టి రేట్లను కొంతమేర తగ్గించడం, స్టాక్ మార్కెట్‌కు సంబంధించినంత వరకు ఊరట కలిగించడం కూడా మదుపుదారులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. నేడు ఐ.టి., ఇంధనం, మూలధనం వస్తువులు, ఆటో రంగాలకు చెందిన షేర్లు లాభపడ్డాయి.