బిజినెస్

మెట్రో క్యాష్ అండ్ క్యారీలో డిజిటల్ ఇన్వాయసింగ్‌కు శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 11: దేశంలోని 12 మిలియన్ల మంది వ్యాపారులు తమ ఆర్థిక లావాదేవీలను వేగంగా నిర్వహించేందుకు డిజిటలైజేషన్ ఇన్వాయిసింగ్ నిర్వహించేందుకు శ్రీకారం చుట్టినట్లు మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియా ఎండి అరవింద్ మెడిరత్తా పేర్కొన్నారు. భారత్‌తో సహా ప్రపంచంలోని 25 దేశాల్లో తమ సంస్థలతో కలిసి మెట్రో ఒన్ బిజినెస్ డే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించామన్నారు. మన దేశంలో ఎనిమిదివేల వ్యాపార సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యాయన్నారు. వంద పివోఎస్ మెషీన్లను వ్యాపార సంస్థలకు అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. వ్యాపారులు తమ లావాదేవీలను డిజిటలైజ్ చేయడంలో సహాయపడడంతో పాటుగా డిజిటల్ ఇన్వాయిసింగ్ నిర్వహించడం, వ్యాపారాల్లో పారదర్శకత, జిఎస్‌టి విధానాన్ని తీసుకువస్తున్నట్లు చెప్పారు. మెట్రో క్యాష్ అండ్ క్యారీ ద్వారా లావాదేవీలు నిర్వహించేందుకు ఎనిమిదివేల సంస్థలు నమోదు చేసుకున్నాయన్నారు.

పేటిఎమ్ మేరా క్యాష్‌బ్యాక్ సేల్‌లో 75 సంస్థలు

దేశంలోని పది నగరాల్లో 75 సంస్ధలు కోటి రూపాయల చొప్పున మేరా క్యాష్ బ్యాక్ సేల్ లావాదేవీలు నిర్వహించి రికార్డు సృష్టించినట్లు పేటిఎమ్ మాల్ సివోవో అమిత్ సిన్హా తెలిపారు. పేటిఎమ్ ఇ కామర్స్‌కు చెందిన పేటిఎమ్ మాల్ పరిధిలో 30వేల మంది వ్యాపారులు తమ టెక్నాలజీ సేవలు వినియోగించుకుంటున్నారన్నారు. వీరికి ప్రతి క్షణం ఆర్డర్లు వస్తున్నాయన్నారు. బెంగళూరు, న్యూఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, జైపూర్, అహ్మదాబాద్, విశాఖపట్నం తదితర నగరాల్లో ఈ లావాదేవీలు భారీగా జరుగుతున్నాయన్నారు.

జిల్లాకో టెక్నాలజీ పార్కును
మంజూరు చెయ్యండి
కేంద్ర మంత్రి సుజనకు తెలంగాణ ప్రతినిధి విజ్ఞప్తి

ఆంధ్రభూమి ప్రతినిధి
న్యూఢిల్లీ, అక్టోబర్ 11: తెలంగాణలోని ప్రతి జిల్లాకు ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ పార్కును మంజూరు చేయాలని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి సుజనా చౌదరికి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజావత్ విజ్ఞప్తి చేశారు. సుజనా చౌదరితో బుధవారం తేవత్ సమావేశమయ్యారు. అనతంరం విలేఖరులతో మాట్లాడుతూ పాలనా సౌలభ్యంకోసం తెలంగాణలో 21 నూతన జిల్లాలను ఏర్పాటు చేశారని కేంద్ర మంత్రికి వివరించారు. కొత్తగా ఏర్పాటుచేసిన జిల్లాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పార్కులను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఖమ్మం, మహబూబ్‌నగర్, కరీంనగర్‌తోపాటుగా ముఖ్య నగరాల్లో ప్లానిటోరియంలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని ఆయన పేర్కొన్నారు.

కొంపెల్లిలో
హెచ్‌డిఎఫ్‌సి శాఖ ప్రారంభం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 11: ప్రముఖ గృహ రుణ సంస్థ హౌసింగ్ డెవలెప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్‌డిఎఫ్‌సి) తన 12వ కార్యాలయాన్ని హైదరాబాద్ నగర శివారులోని కొంపెల్లిలో ప్రారంభించింది. ఈ కార్యాలయం ద్వారా కొంపెల్లి, సమీపంలోని ప్రాంతాల ప్రజలకు అవసరమైన గృహ రుణాలను అందిస్తుందని హెచ్‌డిఎఫ్‌సి తెలంగాణ, ఎపి రీజినల్ బిజినెస్ హెడ్ రాజన్ తండన్ తెలిపారు. బుధవారం కొంపెల్లి శాఖను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కొంపెల్లి ప్రాంతంలో తమ శాఖ ప్రారంభించడం ద్వారా అవసరమైన వినియోగదారులకు వేగంగా సేవలు అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రధానమంత్రి ఆవాజ్ యోజన పథకం కింద అర్హులైన ఆర్థికంగా బలహీన వర్గాల అభ్యున్నతికి గాను తాము ఇచ్చే రుణం ద్వారా వడ్డీ రేటులో ఊరట కలిగిస్తున్నట్లు చెప్పారు. ఎల్‌ఐజి, ఎంఐజి కస్టమర్లకు వడ్డీలో 6.5 శాతం సబ్సిడీని రూ.6 లక్షల రుణం వరకు ప్రధానమంత్రి ఆవాజ్ పథకం కింద అందిస్తున్నట్లు తెలిపారు.
20 శాతం వృద్ధి లక్ష్యంతో గోద్రెజ్ గృహోపకరణాలు
గృహోపకరణాల విక్రయాల్లో దూసుకుపోతున్న గోద్రెజ్ అప్లియెనె్సస్ విభాగం ఈ ఆర్థిక సంవత్సరాంతానికి 20 శాతం వృద్ధి సాధించాలని నిర్ణయించింది. రూ.3,300 కోట్ల నుంచి రూ.4 వేల కోట్ల టర్నోవర్ సాధించేందుకు లక్ష్యంగా నిర్ణయించినట్లు గోద్రెజ్ అప్లియెనె్సస్ బిజినెస్ హెడ్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కమల్ నంది తెలిపారు. గృహోపకరణాల రంగం ప్రస్తుతం 10 నుంచి 12 శాతం మాత్రమే వృద్ధి అంచనా కలిగి ఉందని, అయితే తమ వ్యాపార ప్రణాళికలు, గృహోపకరణాల నాణ్యత వంటి వాటిద్వారా వినియోగదారులను ఆశించి 20 శాతం వృద్ధి సాధించే లక్ష్యంతో ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. గృహోపకరణాల శ్రేణి వస్తువుల విక్రయాల్లో 55 శాతం రిఫ్రిజిరేటర్లు, 20 శాతం ఎయిర్ కండిషనర్లు కలిగి ఉండగా, మిగిలిన శాతం మిగిలిన ఉత్పాదనలు కలిగి ఉన్నట్లు ఆయన వెల్లడించారు. 28 శాతం జిఎస్‌టిని తమ పరిశ్రమ భరించాల్సి వస్తోందని అన్నారు.