బిజినెస్

పని కల్పిస్తేనే వేతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, అక్టోబర్ 11: ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు పనులు కల్పించిన వారికే వేతనాలు చెల్లించాలని గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీచేసింది. గ్రామీణ స్థాయిలో ఉపాధిహామీ పథకంలో పనిచేసే క్షేత్రసహాయకులకు లక్ష్యాలను నిర్దేశించింది. తెలంగాణ రాష్ట్రంలోని 31జిల్లాల పరిధిలో ఉన్న సుమారు 30వేలమంది క్షేత్రసహాయకుల్లో అనేక మంది కూలీలకు పనులు కల్పించడంలేదనే ఆరోపణలు వెలువడుతుండటం, మరికొంతమంది కనీస స్థాయిలో లక్ష్యాలను చేరుకోకపోవడంతో ఈ ఉత్తర్వులు జారీచేశారు. కూలీలకు నిర్దేశించిన పనిదినాలు కల్పించిన క్షేత్రసహాయకులకే వేతనం ఇవ్వాలని, కనీసం మూడువేల పనిదినాలు కల్పించలేని క్షేత్రసహాయకులకు ఉద్వాసన పలకాలని కూడా ఆదేశాల్లో పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల ఆధారంగా ఉపాధిహామీ పథకంలో నమోదై ఉన్న కూలీలతో శ్రమశక్తి సంఘాలు ఏర్పాటు చేశారు. వీరికి పని కల్పించేందుకు క్షేత్రసహాయకులను నియమించారు. హెచ్‌ఆర్ పాలసీ ప్రకారం వీరి ఉద్యోగ కాలపరిమితి ప్రతి ఏడాది జూలై 1నుంచి మరుసటి ఏడాది జూన్ 30వ తేదీ వరకు ఉంటుంది. గడువు పూర్తయిన తరువాత మరుసటి ఏడాదికి కాంట్రాక్ట్‌ను పొడిగిస్తూ ఉంటారు.
వీరికి అన్ని రకాల భత్యాలు కలిపి నెలకు పదివేల రూపాయలు చెల్లిస్తున్నారు. కొత్త నిబంధన ప్రకారం ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఏడాదికాలంలో కూలీలకు ఆరువేల పనిదినాలు కల్పించిన క్షేత్రసహాయకులకు మాత్రమే ఈ వేతనాలు చెల్లిస్తారు. వీరిని ఒకటవ విభాగంగా నిర్దేశిస్తారు. మూడువేల నుంచి 5999 పనిదినాలు కల్పించిన వారిని రెండవ విభాగం కింద నిర్దేశించి ఐదువేల రూపాయలు చెల్లిస్తారు. మూడువేల కంటే తక్కువ పనిదినాలు కల్పించిన వారిని మూడవ విభాగం కిందకు తీసుకువచ్చి వీరికి మరుసటి ఏడాది కాంట్రాక్ట్ పొడిగించవద్దని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
వీరి స్థానంలో సీనియర్ మేట్లకు బాధ్యతలు అప్పగించనున్నారు. ఆయా గ్రామాల్లో జాబ్‌కార్డులు ఉన్న కూలీలందరికీ తప్పనిసరిగా పని కల్పించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సామాజిక తనిఖీల్లో బినామి కూలీలు, బోగస్ మస్టర్లు పనులు ప్రారంభించకపోవడం, తప్పుడు కొలతలు వంటివి విరివిగా వస్తుండటంతో అవి తిరిగి పునరావృతం కాకుండా చూసుకోవాలని గ్రామీణాభివృద్ధి శాఖ జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.