బిజినెస్

ఐఇఇ ఐపిఒకు రెండింతల బిడ్లు దాఖలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: నిధుల సమీకరణ కోసం ప్రాథమిక మార్కెట్‌లోకి అడుగుపెట్టిన ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ (ఐఇఇ)కి మదుపరుల నుంచి మంచి ఆదరణ లభించింది. బిడ్డింగ్ చివరి రోజయిన బుధవారం నాటికి ఈ కంపెనీ ఐపిఒ (ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్) రెండింతలు సబ్‌స్క్రైబ్ అయింది. రూ. 1,001 కోట్ల నిధుల సమీకరణ కోసం ఈ కంపెనీ 52,75,889 షేర్ల విక్రయానికి ఐపిఒ జారీ చేయగా, 1,09,31,103 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఇ)లో బుధవారం సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉన్న గణాంకాలు వెల్లడించాయి. దేశంలోని ఒక విద్యుత్ ఎక్స్చేంజ్ తన షేర్లను విక్రయించడం కూడా ఇదే తొలిసారి. ఇదిలా ఉండగా, కంపెనీ యాంకర్ ఇనె్వస్టర్లకు సవరించిన కేటాయింపులను ప్రకటించింది. యాంకర్ ఇనె్వస్టర్లకు ఒక్కో షేర్‌కు రూ. 1,650 చొప్పున 7,89,120 షేర్లు కేటాయించాలని కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ఐపిఒ కమిటీ మంగళవారం జరిగిన సమావేశంలో నిర్ణయించినట్లు బుధవారం బిఎస్‌ఇ ఒక నోటీసులో తెలిపింది. ఎఫ్‌పిఐ (్ఫరిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు)లకు యాంకర్ ఇనె్వస్టర్ల కోటాలో షేర్లు కేటాయించడం లేదని కంపెనీ స్పష్టం చేసింది. 18,19,501 షేర్లను ఒక్కో షేర్‌కు రూ. 1,650 ధర చొప్పున యాంకర్ ఇనె్వస్టర్లకు కేటాయించాలని కంపెనీ గతంలో నిర్ణయించింది.
అయితే యాంకర్ ఇనె్వస్టర్ల నుంచి బిడ్లు అందిన తరువాత ఎఫ్‌పిఐలు ఈ విభాగంలో షేర్లు కొనుగోలు చేయడానికి అర్హత లేదని తేలడంతో కంపెనీ ఈ కేటాయింపులను సవరించింది.