బిజినెస్

రసాయన పరిశ్రమల విపత్తు యాజమాన్యం ఏర్పాటు అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 11: మానవాళిపై ప్రభావాన్ని చూపించే రసాయన పరిశ్రమల విపత్తులను ఎదుర్కొనే యాజమాన్యం (కెమికల్ ఇండస్ట్రియల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్) అత్యంత అవసరం అని కార్మిక, ఉపాధి కల్పనా, పరిశ్రమల శాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్ తెలిపారు. కెమికల్ (ఇండస్ట్రియల్) డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (సిఐడిఎం)పై మూడు రోజుల పాటు ఏర్పాటైన సదస్సును కమిషనర్ అహ్మద్ నదీమ్ బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సదస్సును ది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (్ఫక్కీ), పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు (పిఎన్‌జిఆర్‌బి), కేంద్ర ప్రభుత్వ జాతీయ విపత్తుల యాజమాన్య అథారిటీ, సదస్సుకు అతిథ్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా కమిషనర్ అహ్మద్ నదీమ్ ప్రసంగిస్తూ అనేక తీవ్రమైన ప్రకృతి వైపరిత్యాలు ఏర్పడుతున్నప్పటికీ, పెద్ద పరిశ్రమలలో శిక్షణ ప్రక్రియలో పెద్ద ఎత్తున అవగాహన అనేది ఎంతో అవసరమని అని అన్నారు. అయితే ఈ అవగాహన, విజ్ఞాన వ్యాప్తి సూక్ష్మ, మధ్య స్థాయి పరిశ్రమలకూ విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా 3వ రోజన అభ్యాస ప్రక్రియ నిర్వహించడం ద్వారా నిపుణుల నుంచి సలహాలు అందుకోవడానికి ఈ సదస్సు తోడ్పడుతుందని ఆయన వివరించారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అనేది అత్యంత అవశ్యకత కలిగిన అంశం అని ఆయన తెలిపారు. ఉద్యోగులు, వాటాదారులు, సమీపంలో ఉన్న వారందరిపై అత్యంత రసాయన ప్రమాదలకు, దానితో పునరావృతమయ్యే పరిణామాలకు దారి తీస్తుందన్నారు. రసాయన పారిశ్రామిక విపత్తు నిర్వహణపై ఉమ్మడి సమావేశాలు ముఖ్యంగా రసాయనిక, పారిశ్రామిక విపత్తుల నివారణ, నిర్వహణకు ప్రాధాన్యతను ఇస్తాయన్నారు. ఇలాంటి వాటిపై ఇండస్ట్రి ఛాంబర్‌కు చెందిన ఫిక్కీ వంటివి 20 సంవత్సరాలకు పైగా తమ దృష్టిని సారించాయని ఆయన వివరించారు. ఈ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో టిఎంఐ గ్రూపు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ అండ్ చైర్మన్ కో చైర్మన్ టి.మురళీధరన్, కెమికల్, ఇండస్ట్రియల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చైర్మన్ లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్ జెఆర్ భరద్వాజ్, ఫిక్కీ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ నిరంకార్ సక్సేనా తదితరులు పాల్గొన్నారు.