బిజినెస్

మార్కెట్‌లోకి కొత్త బజాజ్ ‘ప్లాటినా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 11: దేశీయ ద్విచక్ర వాహనాల తయారీదారు బజాజ్ ఆటో బుధవారం తన 100సిసి మోటర్‌సైకిల్ ప్లాటినా కంఫర్‌టెక్‌కు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర రూ. 46,656 (్ఢల్లీలో ఎక్స్ షోరూం). ఈ కొత్త ప్లాటినా కంఫర్‌టెక్ ఎల్‌ఇడి డేలైట్ రన్నింగ్ లైట్ల (డిఆర్‌ఎల్)తో వస్తోంది. ఎల్‌ఇడి (డిఆర్‌ఎల్) సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశంలో 100సిసి- 1500సిసి సెగ్మింట్ బైక్‌లలో ప్రవేశపెట్టడం ఇదే తొలిసారని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. తక్కువ శక్తిని వినియోగించుకోవడం (దాదాపు 88 శాతం తక్కువ) కొత్త ప్లాటినా కంఫర్‌టెక్ ఆటోమాటిక్ హెడ్‌ల్యాంపులు గల ఇతర బైక్‌లతో పోలిస్తే అధిక మైలేజీని ఇస్తుందని బజాజ్ ఆటో వివరించింది. అలాగే, ఈ కొత్త బైక్‌లో మిత వ్యయం గల 100సిసి బజాజ్ డిటిఎస్‌ఐ ఇంజిన్‌ను బిగించినట్లు కంపెనీ వెల్లడించింది.