బిజినెస్

పింఛను దరఖాస్తులు ఇక ఆన్‌లైన్‌లోనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 12: పదవీ విరమణ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇక పింఛను కోసం దరఖాస్తును ఆన్‌లైన్‌లో దాఖలు చేసేందుకు వీలుగా ప్రభుత్వం కొత్త విధానాన్ని రూపొందించింది. దీనిని ప్రయోగాత్మకంగా కొన్ని విభాగాల్లో పరిశీలించి, వచ్చే జనవరి 1 నుంచి అన్ని విభాగాల్లో అమలు చేసేందుకు నిర్ణయించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న పింఛను దరఖాస్తు విధానంలో ఫైల్ ఎక్కడుందో సదరు రిటైర్డ్ ఉద్యోగికి తెలియని పరిస్థితి. ఎన్ని పింఛను దరఖాస్తులు ఏయే దశల్లో ఉన్నాయో పర్యవేక్షణకు ప్రభుత్వానికి సైతం తెలియడం లేదు. ఎన్ని పింఛన్లు మంజూరు చేస్తున్నారనే అంశం అక్కౌంటెంట్ జనరల్‌కు తెలియకపోవడంతో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ప్రభుత్వ ఉద్యోగులు తమ పింఛను కోసం దరఖాస్తు చేసే విధంగా డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అక్కౌంట్స్ కొత్తగా వెబ్ ఆధారిత అప్లికేషన్‌ను అభివృద్ధి చేసింది. ఈ అప్లికేషన్ అమలు చేయడం వల్ల ఆరు నెలల ముందుగానే సదరు ఉద్యోగికి ఎస్‌ఎంఎస్ సందేశం పంపుతారు. పింఛను దరఖాస్తులను అందచేయాలని అప్రమత్తం చేస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశాక, వివిధ విభాగాలు ఆ సమాచారాన్ని పరస్పరం అందచేసుకుంటాయి. నకిలీ, బోగస్ దరఖాస్తులను నియంత్రించే వీలు కూడా కలుగుతుంది. ఈ ఏడాది అక్టోబర్ 31 తేదీ లేదా అంతకుముందు పదవీ విరమణ చేయనున్న వ్యవసాయ, పాఠశాల విద్య, ట్రెజరీ, విభాగాలకు చెందిన ఉద్యోగుల పింఛనును తప్పనిసరిగా ఈ ఐటి అప్లికేషన్ ద్వారానే పరిష్కరించాల్సిందిగా ఆదేశించింది. ఈ విభాగాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసి, జనవరి నుంచి అన్ని విభాగాల్లో అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.