బిజినెస్

వచ్చే క్యాబినెట్‌లోగా క్లౌడ్ హబ్ పాలసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 12: త్వరలో క్లౌడ్ హబ్ పాలసీ రూపొందించనున్నట్లు ఏపి ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. విజయవాడలో గురువారం ఐటి శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ఈ పాలసీని వచ్చే మంత్రివర్గ సమావేశం నాటికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెద్ద క్లౌడ్ డేటా సెంటర్లు రాష్ట్రానికి వచ్చేలా ఆకర్షించే విధంగా పాలసీ ఉండాలన్నారు. గేమింగ్, యానిమేషన్‌కు సంబంధించిన కంపెనీలు కూడా రాష్ట్రానికి తీసుకురావడానికి విధానాన్ని రూపకల్పన చేయాలన్నారు. 24/7 విద్యుత్ సరఫరా, విద్యుత్ సబ్సిడీలు, కార్యకలాపాలు ప్రారంభించిన వెంటనే ఫైబర్ కనెక్టివిటీ, రాయితీలు, ఇతర వౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై దృష్టి సారించాల్సి ఉందన్నారు. ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్సులో పరిశోధనా కేంద్రాలు కూడా రాష్ట్రానికి రావాల్సి ఉందన్నారు. ఐటి కంపెనీలకు తమ ఉత్పత్తులకు గ్లోబల్ పేటెంట్ కోసం ప్రభుత్వం సహకరించే విధంగా కార్యాచరణ ఉండాలని ఆదేశించారు.
గోవా సిఎంతో భేటీ
అంతకుముందు సిఎం క్యాంపు కార్యాలయంలో గోవా సిఎం మనోహర్ పారికర్‌ను లోకేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామాభివృద్ధికి తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. వర్మీ కంపోస్టు తయారీ, ఆర్‌ఎఫ్‌ఐడి కార్డుల జారీ గురించి తెలిపారు. త్వరలో మరోసారి రాష్ట్రానికి వచ్చి, గ్రామాభివృద్ధిని నేరుగా చూస్తానని పారికర్ హామీ ఇచ్చారు.