బిజినెస్

టాటా టెలీసర్వీసెస్.. ఇక ఎయిర్‌టెల్ చేతికి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: దేశంలో అతిపెద్ద టెలికామ్ సేవల సంస్థ అయిన భారతీ ఎయిర్‌టెల్ ఇక మరింత పెద్దదిగా మారనుంది. మూసివేత దిశగా సాగుతున్న టాటా టెలీ సర్వీసెస్ లిమిటెడ్ (టిటిఎస్‌ఎల్)ను త్వరలో ఎయిర్‌టెల్ కొనుగోలు చేయనుండటమే ఇందుకు కారణం. ఇదే గనుక జరిగితే దేశ టెలికామ్ రంగంలో మరో భారీ విలీనం జరిగినట్లే. ఈ విషయాన్ని అటు ఎయిర్‌టెల్, ఇటు టిటిఎస్‌ఎల్ గురువారం సంయుక్తంగా వెల్లడించాయి. ఈ విలీనంతో టాటా టెలీ సర్వీసెస్ లిమిటెడ్‌తో పాటు టాటా టెలీ సర్వీసెస్ మహారాష్ట్ర లిమిటెడ్ (టిటిఎంఎల్) ఎయిర్‌టెల్ చేతిలోకి వెళ్తాయి. టాటా టెలీ సర్వీసెస్‌కు గత కొంత కాలం నుంచి వరుస నష్టాలు వెంటాడుతుండటంతో ఆ సంస్థను మూసివేయాలని టాటా గ్రూప్ ఇటీవల నిర్ణయించిన విషయం విదితమే. ఈ నిర్ణయం నేపథ్యంలో ఈ విలీన ప్రతిపాదన తెరమీదికి రావడం సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. అయితే ఈ విలీనం విలువ ఎంతన్నదీ ఇటు ఎయిర్‌టెల్ గానీ, అటు టాటా టెలీ సర్వీసెస్ గానీ వెల్లడించలేదు. అయితే ఈ విలీనం రుణ రహితంగానూ, నగదు రహితంగానూ ఉంటుందని, టిటిఎస్‌ఎల్‌కు సంబందించిన రుణాలన్నింటినీ టాటా కంపెనీయే సర్దుబాటు చేసుకుంటుందని ఆ సంస్థ వర్గాలు తెలిపాయి. ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం దేశంలోని 19 సర్కిళ్లలో టాటా టెలీ సర్వీసెస్‌కు చెందిన మొబైల్ వ్యాపారం ఎయిర్‌టెల్ చేతుల్లోకి వెళ్తుంది. దీంతో సుమారు 4 కోట్ల మంది వినియోగదారులు ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లోకి వస్తారు. అలాగే టిటిఎస్‌ఎల్‌కు చెందిన 178.5 మెగా హెర్ట్జ్ స్పెక్ట్రమ్, 1800, 2100, 850 మెగా హెర్ట్జ్ బ్యాండ్‌లు ఎయిర్‌టెల్ సొంతమవుతాయి. ఇదే గనుక జరిగితే ఎయిర్‌టెల్ మరింత బలోపేతమవడంతో పాటు నాలుగో తరం (4జి) టెలికామ్ సేవలను విస్తరించుకోవడంలో ఆ సంస్థకు ఎంతో ఊతాన్ని ఇవ్వడం ఖాయం.