బిజినెస్

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 23: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. గత వారం వరుస మూడు రోజుల నష్టాలను కొనసాగిస్తూ సోమవారం కూడా సూచీలు నేలచూపులు చూశాయి. అమెరికా రిజర్వ్ బ్యాంకైన ఫెడ్ రిజర్వ్.. జూన్‌లో కీలక వడ్డీరేట్లను పెంచనుందన్న అంచనాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 71.54 పాయింట్లు కోల్పోయి 25,230.36 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 18.65 పాయింట్లు పడిపోయి 7,731.05 వద్ద నిలిచింది. సోమవారం ట్రేడింగ్ లో క్యాపిటల్ గూడ్స్, హెల్త్‌కేర్, ఐటి, రియల్టీ రంగాల షేర్ల విలువ పతనమైంది.