బిజినెస్

మార్కెట్లోకి సరికొత్త కెయువి-100

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, అక్టోబర్ 13: దేశీయ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) తమ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం కెయువి-100కు మరిన్ని కొత్త ఫీచర్లను జోడించి కొత్త మోడల్‌ను ఆవిష్కరించింది. కెయువి-100 ఎన్‌ఎక్స్‌టి పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ అప్‌డేటెడ్ వెర్షన్‌ను 40 కొత్త ఫీచర్లతో తీర్చిదిద్దినట్లు ఆ సంస్థ వెల్లడించింది. కెయువి-100 మోడల్‌ను మార్కెట్‌లో ప్రవేశపెట్టిన తర్వాత కేవలం 21 నెలల వ్యవధిలోనే కొత్త మోడల్‌ను ఆవిష్కరించగలిగామని, దీంతో తాము స్పోర్ట్స్ యుటిలిటీ వాహన (ఎస్‌యువి) సెగ్మెంట్‌లోని రూ.4.5 లక్షల నుంచి రూ.7.5 లక్షల శ్రేణిలో కొత్త కేటగిరీని సృష్టించినట్లయిందని మహీంద్రా అండ్ మహీంద్రా సేల్స్ విభాగ సీనియర్ జనరల్ మేనేజర్ దీపక్ కపూర్ శుక్రవారం భోపాల్‌లో విలేఖరులకు తెలిపారు. జిపిఎస్ నావిగేషన్‌తో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటెయిన్‌మెంట్, వాయిస్ అలర్ట్‌తో కూడిన సరికొత్త డ్రైవర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లాంటి 40 కొత్త ఫీచర్లతో రూపొందించిన కెయువి-100 ఎన్‌ఎక్స్‌టి పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో ఐదు వేరియంట్లలో లభ్యమవుతుందని ఆయన వివరించారు.

చిత్రం..సరికొత్త ఫీచర్లతో కెయువి-100 ఎన్‌ఎక్స్‌టి
కారును ఆవిష్కరిస్తున్న మహీంద్రా ప్రతినిధులు