బిజినెస్

ఆర్‌ఐఎల్ లాభం 12.5 శాతం వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో తమ ఏకీకృత నికర లాభం 12.5 శాతం వృద్ధిచెంది రూ.8,109 కోట్లకు చేరుకుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) శుక్రవారం వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలంలో తమ నికర లాభం రూ.7,209 కోట్లుగా ఉందని ఆ సంస్థ తెలిపింది. గత ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.81,651 కోట్లుగా ఉన్న తమ ఆదాయం ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 23.9 శాతం వృద్ధిచెంది రూ.1,01,169 కోట్లకు పెరిగిందని, అయితే గత ఏడాది రెండో త్రైమాసికంలో రూ.21.3 కోట్లుగా ఉన్న రిలయన్స్ జియో నికర నష్టం ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.270.59 కోట్లకు పెరిగిందని ఆర్‌ఐఎల్ స్పష్టం చేసింది.