బిజినెస్

విశాఖ మెట్రోకు కదలిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 13: విశాఖ మెట్రోకు మరోసారి కదలిక వచ్చింది. కేంద్రం సవరించిన ప్రతిపాదనల మేరకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో విశాఖ మెట్రో నిర్మాణానికి సంబంధించి ఆసక్తి వ్యక్తీకరణ కోరుతూ ప్రభుత్వం బిడ్డర్లను ఆహ్వానించింది. రూ.8,800 కోట్లతో మెట్రో నిర్మాణానికి అమరావతి మెట్రోరైల్ కార్పొరేషన్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. గత ఎన్నికలకు ముందు అప్పటి యుపిఎ ప్రభుత్వం విశాఖ మెట్రోరైల్ నిర్మాణ ప్రతిపాదన చేయగా, విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన ఎన్‌డిఎ ప్రభుత్వం విశాఖ, అమరావతి మెట్రోరైల్ నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. అయితే కొన్ని కారణాల నేపథ్యంలో అమరావతి మెట్రోరైల్ నిర్మాణంలో తర్జన భర్జన కొనసాగుతుండగా, విశాఖ మెట్రోరైల్ మాత్రం ఆశలు రేకెత్తిస్తోంది. తాజాగా పలు దేశ,విదేశీ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆమరావతి మెట్రోరైల్ కార్పొరేషన్ సమావేశం నిర్వహించి ఆసక్తి వ్యక్తీకరణ కోరడంతో విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టుపై ఆశలు చిగురిస్తున్నాయి. అనకాపల్లి, భీమునిపట్నం మున్సిపాలిటీల విలీనంతో 20 లక్షల జనాభాకు చేరుకున్న మహావిశాఖ నగరపాలక సంస్థ (జివిఎంసి) పరిధిలో మెట్రోరైల్ ఏర్పాటు అవసరాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి. గతంలో 20 శాతం నిధులు కేంద్రం, 20 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు భరించి, మిగిలిన మొత్తాన్ని ప్రైవేటు ఆర్థిక సంస్థల నుంచి రుణంగా తీసుకోవాలని భావించాయి. మూడు కారిడార్లుగా 43 కిలోమీటర్ల మేర మెట్రోరైల్ ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదనకు అప్పటి కన్సల్టెంట్ ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్ (డిఎంఆర్‌సి) అంగీకరించింది. ఈ మేరకు భౌగోళిక, ఇతర సర్వేలను పూర్తి చేసింది. గాజువాక నుంచి కొమ్మాది వరకూ 30.38 కిమీ, గురుద్వారా నుంచి పాతపోస్ట్ఫాసుకు 5.92 కిమీ, తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరుకు 6.9 కిమీ మేర మూడు కారిడార్లను నిర్మించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుకు అప్పట్లో జపాన్‌కు చెందిన జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేటివ్ ఏజెన్సీ (జైకా) విశాఖ మెట్రోరైల్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. అంతలోనే జైకా తన ప్రతిపాదన విరమించుకోగా జర్మనీ, ఫ్రాన్స్‌కు చెందిన ఆర్థిక సంస్థలు తెరపైకి వచ్చాయి. అయితే ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుని మెట్రోరైల్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకుంది. దీంతో అప్పటి ప్రతిపాదన మేరకు రూ.10 వేల కోట్లతో మెట్రోరైల్ ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదన మరుగున పడిపోయింది. తాజాగా విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టు బాధ్యతలు చేపట్టిన అమరావతి మెట్రోరైల్ కార్పొరేషన్ రూ.8,800 కోట్లతో పూర్తయ్యేలా విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టును చేపట్టేందుకు ఆసక్తి వ్యక్తీకరణను వివిధ సంస్థలను ఆహ్వానించింది. దేశ, విదేశాలకు చెందిన సుమారు 17 సంస్థలు మెట్రోరైల్ ప్రాజెక్టుపై ఆసక్తిని కనబరుస్తూ అంగీకారాన్ని తెలిపాయి. దక్షిణ కొరియా, జపాన్, మలేషియా, ఇటీలీ, ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాలకు చెందిన ప్రఖ్యాత సంస్థలు ముందుకు వచ్చాయి. వచ్చే డిసెంబర్ లోగా మరోసారి ఈ సంస్థలతో సమావేశమై ప్రాజెక్టుకు తుది రూపునివ్వాలని నిర్ణయించినట్టు అమరావతి మెట్రోరైల్ కార్పొరేషన్ ఎండి రామకృష్ణారెడ్డి తెలిపారు. దీనిలో భాగంగా ప్రాజెక్టు వ్యయంలో రూ.4,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించగా, మిగిలిన మొత్తాన్ని ప్రాజెక్టు చేపట్టే సంస్థలు పెట్టుబడిగా పెడతాయని వివరించారు.