బిజినెస్

వచ్చేది హైపర్‌సోనిక్ యుగమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, అక్టోబర్ 14: గంటకు వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే హైపర్‌సోనిక్ విమానాలు మరో దశాబ్ద కాలంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. హైపర్‌సోనిక్ వాహనాలు, ఎదురయ్యే సవాళ్లు అనే అంశంపై సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన కంది గ్రామ శివారులోని హైదరాబాద్ ఐఐటి కేంద్రంలో శనివారం నిర్వహించిన సదస్సులో వారు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన డిఆర్‌డిఎల్ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లేబొరేటరీ) డైరెక్టర్ ఎంఎస్‌ఆర్.ప్రసాద్ మాట్లాడుతూ ఐఐటి లాంటి విద్యా సంస్థల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు తమ మేథస్సును ఉపయోగించి ఆధునిక ప్రయోగాల ద్వారా నూతన ఒరవడిని సృష్టించే ప్రయత్నం చేయాలని సూచించారు. హైపర్‌సోనిక్ విమానాలను తయారు చేయడానికి ముందు వాటి నుంచి వెలువడే ఉష్ణోగ్రతను తట్టుకునే లోహాలను ఉపయోగించడంపై ప్రధానంగా దృష్టి సారించాలని కోరారు. హైపర్‌సోనిక్ విమానాల్లో గంటకు 6 వేల కిలోమీటర్ల వేగం నుంచి 12 వేల కిలోమీటర్ల వేగం వరకు ప్రయాణించే అవకాశం ఉంటుందన్నారు. ఈ విమానాలు వెళుతున్నప్పుడు వెలువడే 1800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉత్పత్తి అవుతుందని, ఆ ఉష్ణోగ్రతను తట్టుకునే పరికరాలను తయారు చేసేందుకు అవసరమైన లోహాలపై పరిశోధనలు సాగించాలని శాస్తవ్రేత్తలకు, విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఇటీవల కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో గల విక్రం తారాబాయి స్పేస్ స్టేషన్‌లో 20 సెకండ్ల పాటు స్థిరమైన స్థితిలో ప్రయత్నం చేసినట్లు వెల్లడించారు. ఈ ప్రయత్నం ద్వారా ఫలితాలు అనుకూలంగా కనిపించాయని తద్వారా హైపర్‌సోనిక్ విమానాలను త్వరలోనే అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. డిఎంఆర్‌ఎల్‌లో గత 15 సంవత్సరాలుగా ఈ ప్రయత్నాలు సాగిస్తున్నట్లు చెప్పారు. శాస్తవ్రేత్తలు, యువకులైన విద్యార్థులు సరికొత్త ఆలోచనల ద్వారా ప్రయోగాలు, పరిశోధనలు చేయాలన్నారు. తక్కువ ధరలో తిరిగి వినియోగించుకోగలిగే వాహనాలను ఉత్పత్తి చేయాలని కోరారు. డిఆర్‌డిఓ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్) నావెల్ సిస్టం మెటీరియల్ డైరెక్టర్ జనరల్ పనీర్ వి థామస్ మాట్లాడుతూ 1950-80 మద్య కాలంలో అమెరికా దేశం మొట్టమొదటిసారిగా హైపర్‌సోనిక్ వాహనాల ఉత్పత్తికి ప్రయత్నం చేసిందన్నారు. ఇప్పటికీ సత్ఫలితాన్ని సాధించలేకపోయారన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పరిశోధనల ద్వారా పదేళ్ల కాలంలో ఈ విమానాలు అందుబాటులోకి వచ్చే నమ్మకం కలుగుతుందని వివరించారు. ఇలాంటి విమానాల సేవలు రక్షణ రంగంలో కీలకంగా మారుతాయన్నారు. 2050 సంవత్సరం నాటికి ఈ విమానాల ద్వారా ఖండాంతరాలను గంటల వ్యవధిలో ప్రయాణం చేసే వెసులుబాటు లభించడం ఖాయమన్నారు. డిఎంఆర్‌ఎల్‌లో యుద్ధప్రాతిపదికన పరిశోధనలు కొనసాగుతున్నాయని, అవసరమైన నిధులు, పరికరాలు అందుబాటులో ఉన్నాయని, శాస్తవ్రేత్తలు, విద్యార్థులు సద్వినియోగపర్చుకోవాలని సూచించారు. ఈ సదస్సులో వివిధ శాఖలకు చెందిన సుమారు 200 మంది శాస్తవ్రేత్తలు, ఆయా రంగాల నిపుణులు, విద్యార్థులు భాగస్వాములయ్యారు. ప్రధాన శాస్తవ్రేత్తలు ఆర్‌కె.శర్మ, శ్యాం మోహన్.ఎన్, ఐఐటి ప్రొఫెసర్లు సుబ్రమణ్యం, రాజ్ బెనర్జీ పాల్గొన్నారు.

చిత్రం..ఐఐటిహెచ్ సదస్సులో మాట్లాడుతున్న డిఆర్‌డిఎల్ డైరెక్టర్ ఎంఎస్‌ఆర్.ప్రసాద్