బిజినెస్

బిఎఫ్‌ఐఎల్ విలీన పథకానికి ఇండస్‌ఇండ్ బోర్డు ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 14: దేశంలోని అతిపెద్ద మైక్రో ఫైనాన్స్ సంస్థల్లో రెండవదిగా ఉన్న బిఎఫ్‌ఐఎల్ (్భరత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లిమిటెడ్)ను త్వరలో తాము కొనుగోలు చేయబోతున్నామని ప్రైవేటు రంగంలోని ఇండస్‌ఇండ్ బ్యాంకు శనివారం వెల్లడించింది. ఇండస్‌ఇండ్ బ్యాంకు తన పరిమాణాన్ని పెంచుకుని, మరింత మంది ఖాతాదారులకు చేరువయ్యేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుంది. దేశంలో ఒక మైక్రో ఫైనాన్స్ సంస్థను బ్యాంకులో విలీనం చేయనుండటం ఇదే తొలిసారి. దీంతో ఇది మున్ముందు జరగే ఇటువంటి విలీనాలకు పరీక్షగా నిలువనుంది. ఈ విలీనానికి సంబంధించి బిఎఫ్‌ఐఎల్‌కు, తమకు, పూర్తిగా తమ ఆధీనంలో ఉన్న అనుబంధ సంస్థకు మధ్య కుదిరిన కాంపోజిట్ స్కీమ్ ఆఫ్ అగ్రిమెంట్‌ను శనివారం జరిగిన తమ బోర్డు సమావేశం ఆమోదించిందని, ఇక ఈ స్కీముకు సంబంధించి తాము రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ)తో పాటు సిసిఐ (కాంపిటీన్ కమిషన్ ఆఫ్ ఇండియా), సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) తదితర సంస్థల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుందని ఇండస్‌ఇండ్ బ్యాంకు స్టాక్ ఎక్స్‌చేంజీలకు తెలియజేసింది. అన్ని అనుమతులు లభ్యమై ఈ స్కీము అమలు జరిగితే పూర్తిగా తమ ఆధీనంలో ఉన్న అనుబంధ సంస్థలో బిఎఫ్‌ఐఎల్ విలీనమవుతుందని, దీంతో బిఎఫ్‌ఐఎల్ వాటాదారుల వద్ద ఉన్న షేర్లకు బదులుగా అనుమతించిన మార్పిడి నిష్పత్తి (0.639 : 1)లో తమ షేర్లను ఇవ్వడం జరుగుతుందని, ఈవిధంగా బిఎఫ్‌ఐఎల్ వాటాదారుల వద్ద ఉన్న ప్రతి 100 షేర్లకు 63.9 చొప్పున తమ షేర్లను ఇవ్వడం జరుగుతుందని ఇండస్‌ఇండ్ బ్యాంకు వివరించింది. గతంలో ఎస్‌కెఎస్ మైక్రో ఫైనాన్స్ పేరుతో ఎంతో మందికి చిరపరిచితమైన బిఎఫ్‌ఐఎల్ ఈ ఏడాది జూన్ 30వ తేదీ నాటికి దాదాపు 68 లక్షల మంది ఖాతాదారులను, రూ.7,709 కోట్ల రుణ పోర్ట్ఫులియోను కలిగి ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ రూ.290 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో రూ.236 కోట్ల నష్టాన్ని చవిచూసిన బిఎఫ్‌ఐఎల్ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రూ.37 కోట్ల నష్టాన్ని ఎదుర్కొంది.