బిజినెస్

ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ లాభాలు అదుర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో డీ-మార్ట్ సూపర్ మార్కెట్లను నడుపుతున్న ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికంలో అద్భుత ఫలితాలను సాధించింది. గత ఏడాది రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో రూ.115.64 కోట్లుగా ఉన్న తమ నికర లాభం ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 65.18 శాతం వృద్ధిచెంది రూ.191.02 కోట్లకు, ఆదాయం రూ.2,786.77 కోట్ల నుంచి రూ.3,529.47 కోట్లకు పెరిగిందని, దీంతో గత ఏడాది తొలి రెండు త్రైమాసికాలు ముగిసే నాటికి రూ.234 కోట్లుగా ఉన్న తమ నికర లాభం ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీతో ముగిసిన రెండు త్రైమాసికాల్లో 56.3 శాతం వృద్ధితో రూ.366 కోట్లకు, ఆదాయం రూ.5,431 కోట్ల నుంచి రూ.7,106 కోట్లకు పెరిగిందని ఆ సంస్థ శనివారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజీకి తెలియజేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, కర్నాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో పాటు ఎన్‌సిఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్)లో 136 స్టోర్లను నడుపుతున్న ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ ఈ ఏడాది మార్చి నెలలో స్టాక్ మార్కెట్లలో అడుగు పెట్టిన విషయం విదితమే. ఈ లిస్టింగ్‌కు అద్భుతమైన ప్రతిస్పందన రావడంతో అప్పటివరకూ లో-ప్రొఫైల్ ఇనె్వస్టర్‌గా ఉన్న ఈ సంస్థ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ ఇప్పుడు దేశంలోని అత్యంత సంపన్నులైన తొలి 20 మందిలో ఒకరుగా ఉన్నారు.