బిజినెస్

తెలంగాణ తెల్ల బంగారంపై గుజరాతీల గురి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, అక్టోబర్ 14: తెలంగాణలో పత్తి పంటను కొనుగోలు చేయడంపై గుజరాత్ వ్యాపారులు ప్రత్యేక దృష్టి సారించారు. సిసిఐ నిర్ణయించిన ధరకే కొనుగోళ్లు జరిపేందుకు వారు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. పత్తి నాణ్యతను బట్టి సిసిఐ నిర్ణయించిన ధరను పరిగణలోకి తీసుకోకుండా మొదటి ధరకే మొత్తం పత్తిని కొనుగోలు చేసి తరలించుకుపోవాలని ఆ ప్రాంత వ్యాపారులు పత్తి రైతులతో ముందస్తుగా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. గత నెల రోజులుగా మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో గుజరాత్ వ్యాపారులు సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. తేమ శాతం తక్కువగా ఉన్న పత్తిని మొదటి రకంగా నిర్ధారించి 4320 రూపాయలకు క్వింటాల్ ధరను నిర్ణయించగా, తేమ శాతం ఎక్కువగా ఉన్న పత్తికి క్వింటాల్‌కు 4020 రూపాయలుగా ప్రకటించారు. అయితే గుజరాత్ వ్యాపారులు మాత్రం తేమను పరిగణలోకి తీసుకోకుండా క్వింటాల్‌కు 4320 రూపాయలకు కొనుకోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత యేడాదితో పోల్చుకుంటే ఈ సారి తెలంగాణ రాష్ట్రంలో పత్తి సాగు అధిక విస్తీర్ణంలో జరిగినట్లు అధికారులే నిర్ధారించారు. ఇక కొనుగోలు చేసిన పత్తికి చెక్కుల రూపంలో కాకుండా నేరుగా నగదును రైతుల చేతికి అందించనుండటంతో డబ్బు మొత్తం బ్లాక్ మనీగా మారనుంది. అదే చెక్కుల రూపంలో చెల్లిస్తే బ్యాంకుల్లో జమ చేస్తే రైతులు ఆదాయ పన్నును చెల్లించాల్సి ఉంటుంది. దీంతో సిసిఐకి విక్రయించడానికి రైతులు అనాసక్తిని కనబరుస్తున్నారు. రైతులు సాగు చేసి దిగుబడి చేసిన పత్తిని సిసిఐకి తరలించడానికి రవణా ఖర్చులు భరించడంతో పాటు అమాలి ఖర్చులను కూడా చెల్లించుకోవాల్సి ఉంటుంది. అదే ప్రైవేటు వ్యాపారులైతే నేరుగా రైతుల ఇళ్ల వద్దకే వచ్చి పత్తిని తూకం వేసుకుని అక్కడికక్కడే చెల్లింపులు చేసి పత్తిని గుజరాత్ రాష్ట్రానికి తరలించుకుపోయే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. వేలాది హెక్టార్లలో సాగు చేసిన పత్తిని నిల్వ చేసుకోవడానికి అవసరమైన గోదాములు అంతంత మాత్రంగా ఉండటం, కొనుగోలు కేంద్రాల సంఖ్య కూడా తక్కువగా ఉండటం, వేసవి కాలంలో అగ్ని ప్రమాదాల దృష్ట్యా సాధ్యమైనంత త్వరలో పత్తిని విక్రయించుకోవాలని పత్తి రైతులు ఆరాటపడుతున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ మార్కెట్లకు పత్తి విక్రయానికి ఎంత మాత్రం వచ్చే అవకావం కనిపించడం లేదని కమిషన్ ఏజెంట్లు వాపోతున్నారు. తెలంగాణాలో విచ్చలవిడిగా సాగు అవుతున్న తెల్ల బంగారంపై గుజరాత్ వ్యాపారులు కొనుగోలు చేసి సొమ్ము చేసుకునేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న జిన్నింగ్ మిల్లులు కూడా ఈ సారి గడ్డు పరిస్థితులను ఎదుర్కొనే ప్రమాదంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా రైతులు ఎన్ని ఎకరాల్లో పత్తిని సాగు చేస్తున్నారు? పంట దిగుబడి ఎన్ని క్వింటాళ్లు అవుతుందనే బేరీజు వేసుకుని మద్య దళారుల ద్వారా ముందుగానే అడ్వాన్సులు సైతం చెల్లిస్తున్నట్లు సమాచారం. మొత్తంమీద పత్తి రైతులకు ఈ సారి కాసుల పంట కురుస్తుందని చెప్పవచ్చు.