బిజినెస్

తెలంగాణలో పెట్టుబడులకు మెల్బోర్న్ కంపెనీల ఆసక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 15: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగర కేంద్రంగా పని చేస్తున్న ఆరు సంస్థలు కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో తమ సంస్థలను నెలకొల్పి పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి వ్యక్తీకరిస్తూ లేఖలు ఇచ్చాయని తెలంగాణ రాష్ట్ర సమితి ఆస్ట్రేలయా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్‌లో హైదరాబాద్‌లో జరుగబోయే గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌కు రావడానికి కూడా ఆస్ట్రేలియా ప్రతినిధులు సంసిద్థత వ్యక్తం చేసారని ఆయన తెలిపారు. తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ కంపెనీలు స్థాపించడానికి ఆస్ట్రేలయా కంపెనీలు ఆసక్తికనబరుస్తున్నాయని పేర్కొన్నారు. ఐటీ మంత్రి కె తారకరామారావు, నిజామాబాద్ ఎంపి కల్వకుంట కవిత సూచనల మేరకు నిజామాబాద్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, ఎన్‌ఆర్‌ఐ కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల అమెరికాకు చెందిన 60 కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి అంగీకారం తెలిపాయని నాగేందర్‌రెడ్డి తెలిపారు. విదేశీ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులకు పెట్టడానికి ఒప్పంచడానికి ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ రూ. 50 కోట్ల నిధులు విడుదల చేసారని తెలిపారు. హైదరాబాద్‌లో జరుగబోయే బిజినెస్ సమ్మిట్‌కు ఆహ్వానిస్తూ ఆస్ట్రేలియా రెవిన్యూ మంత్రి కెల్లీ ఒడ్విన్‌ను కలిసి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన పారిశ్రామిక విధానాన్ని వివరించినట్టు నాగేందర్‌రెడ్డి తెలిపారు. ఆస్ట్రేలియాలో ప్రముఖ కంపెనీలైన లైన నెక్సియా, ఇంటిరాక్టివ్ సిఈఓలను కూడా కలిసి బిజినెస్ సమ్మిట్‌కు ఆహ్వానించినట్టు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి మెల్బోర్న్ కంపెనీలను ఒప్పించడానికి కళ్యాణ్ ఐ రెడ్డి, అనిల్‌రెడ్డి కృషి చేసారని నాగేందర్‌రెడ్డి తెలిపారు.

చిత్రం..పెట్టుబడులకు మెల్బోర్న్ కంపెనీలను ఒప్పించిన ఎన్‌ఆర్‌ఐ కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల, ఆస్ట్రేలియా తెరాస విభాగం అధ్యక్షుడు నాగేందర్‌రెడ్డి తదితరులు