బిజినెస్

రియల్ ఎస్టేట్ రంగాన్ని జిఎస్‌టిలోకి తీసుకురావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: రియల్ ఎస్టేట్ రంగాన్ని వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) పరిధిలోకి తీసుకురావాలని మరోసారి డిమాండ్ చేస్తూ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి ఆదివారం లేఖ రాశారు. దేశంలో జిఎస్‌టి అమలు ప్రారంభమైనప్పటి నుంచి ఈ డిమాండ్ చేస్తున్న సిసోడియా, ఇప్పుడు అదే డిమాండ్‌ను మరోసారి పునరుద్ఘాటించారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని జిఎస్‌టి పరిధిలోకి తీసుకురాగలిగితే భూముల ధరలు అసాధారణ రీతిలో పెరగకుండా నిరోధించడంతో పాటు నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు వీలు కలుగుతుందని, అయితే ఈ చర్య చేపట్టేందుకు అసాధారణ రాజకీయ సంకల్ప బలం ఉండాలని ఆయన పేర్కొన్నారు. జిఎస్‌టి కౌన్సిల్ తదుపరి సమావేశం వచ్చే నెల 9వ తేదీన గౌహతిలో జరుగనున్న విషయం విదితమే. రియల్ ఎస్టేట్ రంగాన్ని జిఎస్‌టి పరిధిలోకి తీసుకొచ్చే అంశాన్ని ఈ సమావేశ అజెండాలో చేర్చాలని సిసోడియా డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి సంబంధించిన ప్రతి అడుగులోనూ జిఎస్‌టిని అమలు చేయగలిగితే ఆ రంగానికి సంబంధించిన ప్రతి లావాదేవీలోనూ పారదర్శకత పెరుగుతుందని, తద్వారా భూముల ధరలు అసాధారణ రీతిలో పెరగకుండా నిరోధించడంతో పాటు నల్లధన ప్రవాహాన్ని అడ్డుకునేందుకు వీలవుతుందని తాను అభిప్రాయపడుతున్నానని, దీనిని దృష్టిలో ఉంచుకుని జిఎస్‌టి కౌన్సిల్ తదుపరి సమావేశంలో రియల్ ఎస్టేట్ రంగంపై నిర్ణయం తీసుకోగలదని ఆశిస్తున్నానని సిసోడియా తెలిపారు.

చిత్రం..ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా