బిజినెస్

మళ్లీ కొండెక్కిన టమోటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, అక్టోబర్ 15: చిత్తూరు జిల్లాలోని పడమటి మండలాల్లో సాగు చేస్తున్న టమోటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గత వారం రోజులుగా కిలో టమోటా రూ.25 నుంచి రూ.30లు పలుకుతుండగా ఆదివారం ఏకంగా 40 రూపాయలు పలికింది. గత సెప్టెంబర్ చివరి వరకు ధరలు తగ్గుముఖం పట్టి మరలా యథాస్థితికి చేరుకోవడం తర్వాత ధరలు తగ్గింది లేదు. జిల్లాలోని టమోటా రైతులకు తమిళనాడు, కర్నాటక, కేరళ ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులు కలిసొస్తున్నాయి. పడమటి మండలాల్లో అతిపెద్ద టమోటా మార్కెట్ మదనపల్లి, తర్వాత బి.కొత్తకోట, అంగళ్ళు, ములకలచెరువు, గుర్రంకొండ, వాల్మీకిపురం, కలికిరి, పుంగనూరు, చింతపర్తి, తరిగొండలలో టమోటా మార్కెట్‌లలో సైతం టమోటా ధరలు పెరిగాయి. ఈ ప్రాంతాల్లో కొనుగోలు చేస్తున్న టమోటా రాష్ట్రంలోని ఆదోని, విజయవాడ, బాపట్ల, గుంటూరు మార్కెట్‌లతో పాటు తెలంగాణాలోని హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ తదితర ప్రాంతాలకు నిత్యం ఎగుమతి అయ్యేది. తెలంగాణ ప్రాంతంలో టమోటా సాగు పెరగడంతో కోస్తా ఆంధ్రా ప్రాంతాలకే ఎక్కువ మంచి జరుగుతోంది. ఈ ఏడాది మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, కేరళ, కర్నాటక రాష్ట్రాలకు ఎగుమతులు విస్తరించడం.. వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేస్తుండటంతో ధరలు పెరుగుతున్నాయి. నెల క్రితం కిలో రూపాయి నుంచి రెండు రూపాయలకే పరిమితమైన టమోటా వారం రోజులుగా ధర రూ.25 నుంచి 45 రూపాయలకు పెరిగింది. దీనికి కారణం పక్క రాష్ట్రాల్లో టమోటా డిమాండ్ పెరగడం, ఇక్కడ సాగు అధికంగా ఉండటం టమోటా రైతులకు కలిసొచ్చింది. ప్రస్తుతం తమిళనాడులో డిమాండు ఎక్కువగా ఉండటంతో ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది. కొద్ది రోజులపాటు ఇవే ధరలు కొనసాగే అవకాశముందని మార్కెటింగ్ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆదివారం మార్కెట్‌కు 248 టన్నుల టమోటా రాగా మొదటి రకం టమోటా పది కిలోలు రూ.420, రెండవ రకం రూ.300, మూడవ రకం రూ.230లు పలికింది.

చిత్రం..మదనపల్లె మార్కెట్‌కు వచ్చిన టమోటా