బిజినెస్

ఐఫోన్-7 @ రూ.7,777

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: దేశీయ టెలికామ్ సంస్థల్లో అతిపెద్దదైన భారతీ ఎయిర్‌టెల్ తన ఆన్‌లైన్ స్టోర్ ద్వారా యాపిల్ ఐఫోన్-7, ఐఫోన్-7 ప్లస్ హ్యాండ్‌సెట్లను సులభ వాయిదాల పద్ధతిలో అమ్ముతోంది. సోమవారం నుంచి ఈ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. 32జీబీ స్టోరేజి సామర్ధ్యాన్ని కలిగివున్న ఐఫోన్-7ను కొనుగోలు చేయదలుచుకున్న వారు 7,777 రూపాయల డౌన్ పేమెంట్‌ను చెల్లించి ఈ హ్యాండ్‌సెట్లను పొందవచ్చు. మిగిలిన మొత్తాన్ని నెలకు 2,499 రూపాయల చొప్పున 24 నెలల పాటు కిస్తీల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. త్వరలో ఇతర బ్రాండ్ల హ్యాండ్‌సెట్లను కూడా తమ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా అమ్ముతామని, ఈ హ్యాండ్‌సెట్లన్నీ తమ నెలవారీ మొబైల్ సర్వీస్ ప్లాన్లతో కలిపి లభ్యమవుతాయని భారతీ ఎయిర్‌టెల్ ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే ఇవే హ్యాండ్‌సెట్లను ఇంతకంటే తక్కువ ధరకు అమ్ముతున్న వివిధ ఇ-కామర్స్ సంస్థల నుంచి ఎయిర్‌టెల్ ఆన్‌లైన్ స్టోర్‌కు గట్టి పోటీ ఎదురుకానుంది.