బిజినెస్

హైలో ‘హై’లెస్సా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 16: కొత్త వారంలో అనుకున్నట్లుగానే భారత స్టాక్ మార్కెట్లు సరికొత్త ఉత్సాహంతో పరుగులు పెట్టాయి. స్థూల ఆర్థిక గణాంకాలు సానుకూలంగా ఉండటం, ఐఎంఎఫ్ ప్రోత్సహక వ్యాఖ్యల కారణంగా ఇనె్వస్టర్లలో కొత్త ఉత్తేజం పెరగడం వలన సోమవారం జరిగిన లావాదేవీల్లో మార్కెట్లు భారీగా పుంజుకున్నాయ. సెనె్సక్స్ ఏకంగా 200.95 పాయింట్లు పెరిగి గతంలో ఎన్నడూ లేని రీతిలో 32,633.64 పాయింట్ల వద్ద ముగిసింది. సెనెక్స్ ఇంతటి భారీ స్థాయికి చేరుకోవడం ఇదే మొదటిసారి. అలాగే ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ కూడా ఒక దశలో 10,242.95 పాయింట్ల ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరుకుని అనంతరం చివరికి 10,230.85 పాయింట్ల వద్ద ముగిసింది. అక్టోబర్ 13న ముగిసిన స్థాయి కంటే ఇది 63.40 పాయింట్లు ఎక్కువ. చమురు కంపెనీల నుంచి టెలికామ్ కంపెనీల వరకు రెండో త్రైమాసిక ఫలితాలు సానుకూలంగా రావడం మార్కెట్లలో ఉత్సాహకరమైన వాతావరణాన్ని పాదుకొల్పింది. వీటితో పాటు అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు కూడా దేశీయ స్టాక్ మార్కెట్లకు కొత్త ఊతాన్నిచ్చాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే అమెరికా డాలర్‌తో పోలిస్తే మరింతగా పుంజుకుని 64.68కు చేరుకోవడం కూడా మార్కెట్ ర్యాలీకి ఊతాన్నిచ్చింది. సెనె్సక్ పెరగడం వలన లాభపడిన సంస్థల్లో భారతీ ఎయిర్‌టెల్, టాటా మోటార్స్ ఎంఅండ్‌ఎం (మహీంద్రా అండ్ మహీంద్రా), హిందుస్థాన్ యూనీ లీవర్, సన్ ఫార్మా, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, కోలిండియా ఉన్నాయి. అయితే యాక్సిస్ బ్యాంకు షేరు విలువ 1.65 శాతం, విప్రో షేరు విలువ 0.62, మారుతీ షేర్ విలువ 0.31 శాతం తగ్గాయి.