బిజినెస్

అంతర్జాతీయ ఫిన్‌టెక్ రోడ్‌షోల్లో ఏపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 17: జపాన్, సింగపూర్, లండన్‌లో జరిగే ఫిన్‌టెక్ రోడ్డు షోల్లో ఆంధ్రప్రదేశ్ పాల్గొననున్నట్లు రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో ఐటి శాఖ అధికారులతో మంత్రి లోకేష్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా ఈ షోల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఫిన్‌టెక్ వ్యాలీ అభివృద్ధి, ఫైనాన్స్ సర్వీస్‌లోని కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు అనుసరించాల్సిన విధానాలపై దృష్టి సారించాలన్నారు. 20 మందితో కలిసి ఫిన్‌టెక్‌ని ఉపయోగించగలిగే 100కు పైగా రంగాలను గుర్తించి కేస్ స్టడీస్ సిద్ధం చేశామని మంత్రి దృష్టికి అధికారులు తీసుకువెళ్లారు. 5 స్టార్టప్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుని, సైబర్ దాడులను తట్టుకునే విధంగా ప్రభుత్వ శాఖల్లో బ్లాక్‌చైన్ టెక్నాలజీ అమలు చేస్తున్నామని మంత్రికి వివరించారు. విశాఖ బ్రాండ్ ప్రపంచానికి తెలిసే విధంగా ఫిన్‌టెక్, బ్లాక్ చైన్ టెక్నాలజీ ఈవెంట్స్ ప్రతి నెలా నిర్వహించాలని మంత్రి తెలిపారు. ఫిన్‌టెక్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టడానికి సుముఖత వ్యక్తం చేసిన మరో 17 కంపెనీలతో చర్చలు జరిపి వీలైనంత త్వరగా కంపెనీలు రాష్ట్రానికి వచ్చే విధంగా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. బ్లాక్ చైన్ బిజినెస్ కాన్ఫరెన్స్‌లో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించిన కంపెనీలతో చర్చలు జరిపి వెంటనే వారు రాష్ట్రానికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరం అయితే కంపెనీలను ఆహ్వానించడానికి తానే స్వయంగా రాష్ట్రంలో ఉన్న సానుకూల పరిస్థితుల గురించి వివరిస్తానన్నారు. వీసా ప్రారంభించిన లెస్ క్యాష్ వైజాగ్‌కు మంచి స్పందన వచ్చిందని, మాస్టర్ కార్డ్ కంపెనీ కూడా వెంటనే కార్యకలాపాలు ప్రారంభించే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ఫిన్‌టెక్, బ్లాక్ చైన్ టెక్నాలజీలో స్థానిక యువత ప్రతిభ వెలుగుచూసేలా ప్రతి నెలా హ్యాకథాన్స్ నిర్వహించాలన్నారు. ఫిన్‌టెక్, బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడకంలో మన కంటే ముందు ఉన్న జపాన్, సింగపూర్, లండన్ ప్రభుత్వాలను కలిసి ఆ కంపెనీలు రాష్ట్రానికి వచ్చే విధంగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు 100 కోట్ల నిధులు ఉన్నాయన్నారు. ప్రభుత్వంతో కలిసి పెట్టుబడులు పెట్టేందుకు ఎస్‌బిఐ, ఐసిఐసిఐ బ్యాంకులు సుముఖత వ్యక్తం చేశాయన్నారు.

చిత్రం..ఐటి అధికారులతో సమీక్షిస్తున్న ఏపి మంత్రి నారా లోకేష్