బిజినెస్

వేసవిలో నిరంతర విద్యుత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, ఫిబ్రవరి 6: రానున్న వేసవిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరంగా విద్యుత్‌ను సరఫరా చేస్తామని జెన్‌కో సిఎండి ప్రభాకర్‌రావు తెలిపారు. శనివారం ఆయన హైడల్ డైరెక్టర్ రాజన్‌తోపాటు సాగర్‌లోని ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని, ఎడమకాల్వపై ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు వేసవిలో వ్యవసాయానికి 9 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా చేయడానికి అన్ని ప్రక్రియలు పూర్తిచేస్తున్నామన్నారు. కాగా, చత్తీస్‌గఢ్ నుండి విద్యుత్‌ను దిగుమతి చేసుకోవడానికి నిర్మిస్తున్న డిచ్‌పల్లి లైన్ ఈ ఏడాది ఆఖరుకల్లా పూర్తవుతుందని తెలిపారు. ఈ లైన్ పూర్తయితే రాష్ట్రానికి 1,000 మెగావాట్ల విద్యుత్ అందుతుందని ఆయన చెప్పారు. కాగా, సాగర్ జలాశయం నుండి 4 టిఎంసిల నీటిని ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటూ కృష్ణా డెల్టాకు నీటి విడుదల చేసుకోవాలని ఆదేశాలు అందిన నేపథ్యంలో పరిశీలనకు వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 136 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగ డిమాండ్ ఉందని, అది వేసవిలో 175 మిలియన్ యూనిట్ల వినియోగానికి పెరగవచ్చని అన్నారు. ఆ డిమాండ్‌కు తగ్గట్లు విద్యుత్‌ను సరఫరా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా ఆయన తెలిపారు. మరోవైపు జెన్‌కోలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి అడ్డంకిగా ఉన్న కోర్టు ఉత్తర్వులు తొలగిపోయాయని వచ్చే వారంలో ఖాళీలను భర్తీచేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

ఉక్కుపై ఎమ్‌ఐపి అమలు
ఇంజినీరింగ్ ఎగుమతులకు విఘాతం: ఇఇపిసి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: ఉక్కు ఉత్పత్తులకు కనీస దిగుమతి ధర (ఎమ్‌ఐపి)ను అమలు చేయడం వల్ల ఇంజినీరింగ్ ఎగుమతులపై దుష్ప్రభావం చూపే వీలుందని ఎగుమతిదారుల సంఘమైన ఇంజినీరింగ్ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఇఇపిసి) శనివారం ఓ ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది. దాదాపు 6-10 శాతం ముడి సరకుల వ్యయం పెరగవచ్చన్నారు. ఇప్పటికే దేశీయ ఎగుమతులు క్షీణితలో నడుస్తున్నాయని ఎమ్‌ఐపి అమలుతో మరింతగా ఎగుమతులు పడిపోయే అవకాశం ఉందని ఇఇపిసి అభిప్రాయపడింది. ఇంజినీరింగ్ ఎగుమతులు గత ఏడాది డిసెంబర్‌లో 15.68 శాతం క్షీణించి 5.82 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. నిజానికి దేశీయ ఎగుమతులన్నీ కూడా గత ఏడాదికిపైగా కాలం నుంచి క్రమేణా పతనమవుతున్నది తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం కేంద్ర ప్రభుత్వం.. పలు రకాల ఉక్కు ఉత్పత్తులపై ఎమ్‌ఐపిని విధించింది. దీంతో ఈ నిర్ణయం వల్ల పెరిగే ముడి సరకుల వ్యయానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించే చర్యలకు ఇఇపిసి డిమాండ్ చేసింది. లేనిపక్షంలో ఎగుమతులు మరింతగా దిగజారి దేశ ఆర్థిక వ్యవస్థ చిక్కుల్లో పడుతుందని హెచ్చరించింది.

శ్రీలంకలో ఐటి పార్కును ఏర్పాటు చేస్తాం
విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్

కొలంబో, ఫిబ్రవరి 6: భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్.. శ్రీలంకలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) పార్కును ఏర్పాటు చేస్తామన్నారు. శ్రీలంకలో రెండు రోజులపాటు పర్యటిస్తున్న మంత్రి శనివారం ఇక్కడ ఓ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. శ్రీలంకలో భారత తొలి ఫెస్టివల్‌లో భాగంగా ‘రైజ్ ఆఫ్ డిజిటల్ ఇండియా ఎగ్జిబిషన్ ఇన్ కొలంబో’ పేరుతో దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కీలకమైన ఐటి రంగంలో పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా శ్రీలంకలో ఐటి పార్కును ఏర్పాటు చేసేందుకు సిద్ధమన్నారు. దీనికి సంబంధించి ఇరు దేశాలు తదుపరి కార్యచరణను రూపొందిస్తాయని తెలిపారు. సామాజిక, ఆర్థిక అభివృద్ధిని సాధించేందుకు ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ ప్రగతిపై దృష్టిపెట్టాలని ఈ సందర్భంగా ఆమె శ్రీలంక ప్రభుత్వానికి సూచించారు. శ్రీలంక మంత్రి మంగళ సమరవీరతో దీనిపై చర్చించినట్లు చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియాను తరచూ ప్రస్తావించడాన్ని ఆమె గుర్తుచేశారు.