బిజినెస్

నౌకాదళ సేవలో ఐఎన్‌ఎస్ తర్ముగలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 23: తీరప్రాంత గస్తీలో మరో కొత్త నౌక వచ్చి చేరింది. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ (జిఆర్‌ఎస్‌ఇ) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐఎన్‌ఎస్ తర్ముగలిని తూర్పునౌకాదళ ప్రధానాధికారి హెచ్‌సిఎస్ బిస్త్ సోమవారం నౌకదళ సేవల్లో ప్రవేశపెట్టారు. ఐఎన్‌ఎస్ తర్ముగలి 320 టన్నుల బరువుతో 48 మీటర్ల పొడవుతో తయారైంది. ఇది గంటకు 30 నాటికల్ మైళ్ల వేగంతో తక్కువ లోతున్న సముద్రంలో సైతం దూసుకుపోయే జెట్ ఫాస్ట్ ఎటాక్ క్రాఫ్ట్‌లో శత్రువులపై మరింత వేగంగా కాల్పులు జరిపేలా రూపొందించారు. ఐఎన్‌ఎస్ తర్ముగలిలో నలుగురు అధికారులతోపాటు 41 మంది నావికులుంటారు.
తర్ముగలి కమాండింగ్ అధికారిగా కమాండర్ శ్రీజిత్ ఎస్ నాయర్ వ్యవహరిస్తారు. అలాగే తర్ముగలిలో అత్యాధునిక సమాచార వ్యవస్థను ఏర్పాటు చేశారు. తీర గస్తీతోపాటు పరిరక్షణలో పాలుపంచుకునే ఈ నౌకలో అత్యాధునిక ఆయుధ సంపత్తి అందుబాటులో ఉంటుంది. మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాకర్టీలో రూపొందించిన 30 ఎంఎం సిఆర్‌ఎన్ 91 గన్స్‌ను ఈ నౌకలో అమర్చడం విశేషం. రెండు 12.7 హెవీ మెషీన్ గన్స్ ఉంటాయి. పగలు, రాత్రి వేళల్లో సైతం ఆయుధాలను ఉపయోగించగలిగే సామర్థ్యం తర్ముగలి నౌకలో ఉంది.
నౌక ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిఆర్‌ఎస్‌ఇ సిఎండి ఎకె వర్మ, నేవల్ ఆఫీసర్ ఇన్‌ఛార్జ్ (ఎపి) కమాండర్ సంజీవ్ ఇస్సార్, ఇఎన్‌సి చీఫ్ స్ట్ఫా ఆఫీసర్ అడ్మిరల్ ప్రదీప్‌రానా తదితరులు పాల్గొన్నారు.

chitram ఐఎన్‌ఎస్ తర్ముగలి