బిజినెస్

పుంజుకున్న తయారీ రంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: దేశంలో విప్లవాత్మక రీతిలో అమలులోకి వచ్చిన వస్తుసేవల పన్ను (జిఎస్‌టి) ప్రారంభ కష్టాలు తీరిపోయాయని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎస్.సి.గార్గ్ మంగళవారం నాడిక్కడ స్పష్టం చేశారు. తయారీ రంగంలో ఆగస్టు నెలకు సంబంధించి 3.1 శాతం వృద్ధిరేటును సాధించడమే జిఎస్‌టి అమలు ఇబ్బందులనుంచి పూర్తిగా బయటపడ్డామని చెప్పడానికి నిదర్శనమని అన్నారు. పారిశ్రామిక ఉత్పాదకత, ధరల పరిస్థితిపై మాట్లాడిన ఆయన ఓ మోస్తరు ద్రవ్యోల్బణం అన్నది సాధారణమేనని, రెండు నెలలపాటు ప్రతికూల వృద్ధిని నమోదు చేసుకున్న తయారీ రంగం ఆగస్టు నెలలో 3.1 శాతం వృద్ధిని సాధించిందని వివరించారు. దీన్నిబట్టి చూస్తే జిఎస్‌టి అమలులో తాత్కాలికంగా తొలి దశలో ఎదురైన కష్టాలను అధిగమించినట్లేనని వివరించారు. అలాగే మొత్తంమీద పారిశ్రామిక ఉత్పత్తి కూడా తొమ్మిది నెలల్లో ఎన్నడూ లేని విధంగా 4.3 శాతం పెరిగిందని స్పష్టం చేశారు. ఇందుకు ప్రధానంగా మైనింగ్, విద్యుత్ రంగాలు మంచి ఫలితాలను సాధించడమేనని, అలాగే మూలధన వస్తువుల సానుకూల ప్రభావం కూడా ఇందుకు దోహదం చేసిందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత ఆర్థిక వృద్ధి రేటు గత మూడేళ్లలో ఎన్నడూ లేనివిధంగా 5.7 శాతానికి దిగజారింది.