బిజినెస్

ఇండిగోలో ఇక ఏటిఆర్ సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 18: ఇండిగో విమానయాన సంస్థ ప్రాంతీయ మార్కెట్‌లోకి అడుగుపెడుతున్నట్లు ఆ సంస్థ అధ్యక్షుడు ఆదిత్యఘోష్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇప్పటి వరకు తన ఏటిఆర్ పనితీరును హైదరాబాదు, చెన్నయ్, బెంగళూరు, మంగళూరు, మధురై, నాగ్‌పూర్ మధ్యతోపాటు టూ టయర్ నగరాలైన తిరుపతి, రాజమండ్రిల మధ్య విమానాలు నడుపుతున్నట్లు వివరించారు. ఈ నగరాల మధ్య అనుసంధానాన్ని మరింత పెంచేందుకు ఏటిఆర్ 72-600 విమానాలను దశల వారీగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. నూతన మార్గాలకు ప్రారంభ ధరను రూ.999గా నిర్ణయించామని, 16వ తేదీ అర్ధరాత్రి నుంచి బుకింగ్‌లను ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. మొదటి విమానం హైదరాబాద్ నుంచి 2017, డిసెంబర్ 21న ప్రారంభం అవుతుందన్నారు. దీంతో టయర్ 2, 3 నగరాలకు కూడా తమ విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకురావటంలో ప్రధాన అడుగు వేసిందని చెప్పారు. ఇండిగో తన ఏటిఆర్ విమానాలను ఇప్పటి వరకు ఉన్న నెట్ వర్క్‌లైన చెన్నయ్-మంగళూరు-చెన్నయ్, హైదరాబాదు-మంగళూరు-హైదరాబాద్, అలాగే హైదరాబాద్-నాగ్‌పూర్-హైదరాబాదు మార్గాలకు పరిచయం చేయనున్నామన్నారు. ప్రాంతీయ విమానయానానికి వాస్తవ రూపాన్ని అందించేందుకు శ్రమిస్తున్న అందరికీ ఇది సంతోషకరమైన విషయమని చెప్పారు. ఈ విమానాల నూతన మార్కెట్‌ను విస్తరించేందుకు అవకాశం కల్పిస్తూ లక్షలాది మంది ప్రయాణికులకు విమాన ప్రయాణ సేవలను ఎంపిక చేసుకునేందుకు చక్కని అవకాశం కల్పిస్తాయన్నారు. తిరుపతి-హైదరాబాద్‌ల మధ్య 6ఇ 7115 విమానం 17.35కు బయలుదేరి 18.50కి హైదరాబాదుకు చేరుకుంటుందన్నారు. 6ఇ 7117 తిరుపతి-హైదరాబాదు మధ్య ప్రతిరోజు 21.10 గంటలకు బయలుదేరి 22.35కు హైదరాబాదుకు చేరుతుందన్నారు. 6ఇ 7106 తిరుపతి-బెంగళూరు విమానం ఉదయం 8.10కి బయలుదేరి 9.15 గంటలకు బెంగళూరుకు చేరుతుందన్నారు. 6ఇ 7107 బెంగళూరు నుంచి ఉదయం 9.40కి బయలుదేరి 10.30కి తిరుపతికి చేరుకుంటుంది. అలాగే 6ఇ 7113 తిరుపతి నుంచి మధ్యాహ్నం 14.20కి బయలుదేరి 15.30కి బెంగళూరుకి చేరుతుంది. 6ఇ 7114 బెంగళూరు నుంచి 15.50కి బయలుదేరి సాయంత్రం 16.50కి తిరుపతికి చేరుతుంది. 6ఇ 7113 తిరుపతి నుంచి మధ్యాహ్నం 14.45కి బయలుదేరి బెంగళూరుకి 15.50కి చేరుతుంది. 6ఇ 7114 బెంగళూరు నుంచి సాయంత్రం 16.20కి బయలుదేరి, 17.15కి తిరుపతికి చేరుతుంది. 6ఇ 7118 హైదరాబాదు నుంచి ఉదయం 7.05 గంటలకు బయలుదేరి రాజమండ్రికి ఉదయం 8.20కి చేరుకుంటుంది. 6ఇ 7122 రాజమండ్రి నుంచి 12.50కి బయలుదేరి హైదరాబాదుకు 14.05కి చేరుకుటుంది. 6ఇ 7123 హైదరాబాదు నుంచి మధ్యాహ్నం 14.30కి బయలుదేరి రాజమండ్రికి 15.30కి చేరుకుంటుంది. 6ఇ 7126 రాజమండ్రిలో రాత్రి 20.10కి బయలుదేరి హైదరాబాదుకు 2.120కి చేరుతుంది. 6ఇ 7119 రాజమండ్రి నుంచి ఉదయం 8.30కు బయలుదేరి 10.25కు బెంగళూరుకు చేరుతుంది. 6ఇ 7121 బెంగళూరు నుంచి 10.40కి బయలుదేరి రాజమండ్రికి 12.30కి చేరుతుంది. 6ఇ 7124 రాజమండ్రి నుంచి సాయంత్రం 16.10కి బయలుదేరి 17.35కి చెన్నయ్ చేరుతుంది. 6ఇ 7125 చెన్నయ్ నుంచి సాయంత్రం 17.50కి బయలుదేరి 19.40కి రాజమండ్రికి చేరుతుంది. 6ఇ 7101 హైదరాబాదు నుంచి ఉదయం 6.40కి బయలుదేరి 8.40కి మంగళూరుకు చేరుతుంది. 6ఇ 7102 మంగళూరు నుంచి మధ్యాహ్నం 13.50కి బయలుదేరి 15.40కి హైదరాబాదుకు చేరుతుంది. 6ఇ 7101 మంగళూరు నుంచి ఉదయం 9.05 గంటలకు బయలుదేరి 11.05కు చెన్నయ్‌కి చేరుతుంది. 6ఇ 7102 చెన్నయ్ నుంచి 11.35కు బయలుదేరి 13.30కి మంగళూరు చేరుకుంటుందన్నారు. 6ఇ 7103 హైదరాబాదు నుంచి సాయంత్రం 16.15కు బయలుదేరి 18.10కి నాగపూర్‌కు చేరుకుంటుంది. 6ఇ 7104 నాగపూర్ నుంచి సాయంత్రం 18.30కి హైదరాబాదుకు రాత్రి 20.25కు చేరుకుటుంది. 6ఇ 7105 హైదరాబాదు నుంచి ఉదయం 6.20కి బయలుదేరి తిరుపతికి 7.50కి చేరుకుటుంది. 6ఇ 7108 తిరుపతి నుంచి 10.50కి బయలుదేరి హైదరాబాదుకు 12.05కు చేరుకుంటుంది. 6ఇ 7112 హైదరాబాదు నుంచి మధ్యాహ్నం 12.40కి బయలుదేరి తిరుపతికి 2.05కి చేరుతుంది. 6ఇ 7116 హైదరాబాదు నుంచి రాత్రి 19.20కి బయలుదేరి 20.50కి చేరుతుంది.