బిజినెస్

త్రైపాక్షిక రవాణా ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెహ్రాన్, మే 23: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహని, అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అషఫ్ ఘని.. సోమవారం ఇరాన్ దక్షిణ తీరంలోని చబహర్ పోర్టుపై త్రైపాక్షిక రవాణా ఒప్పందానికి సంతకాలు చేశారు. మూడు దేశాల అధిపతుల సమక్షంలో కుదిరిన ఈ ఒప్పందం అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘త్రైపాక్షిక రవాణాపై జరిగిన ఈ ఒప్పందం.. మూడు దేశాల చారిత్రాత్మక ఒప్పందం’గా అభివర్ణించారు. వాణిజ్య విస్తరణకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు, వౌలిక రంగ బలోపేతానికి, పారిశ్రామిక రంగాభివృద్ధికి, ఉపాధి, ఉద్యోగ కల్పనకు ఈ ఒప్పందం దోహదపడుతుందని మోదీ వ్యాఖ్యానించారు. ఇరాన్ అధ్యక్షుడు రౌహని మాట్లాడుతూ ‘ఈ రోజును ‘చబహర్ దినం’గా అభివర్ణించవచ్చు. బహర్ అంటే స్పింగ్ అని అర్థం. అందుకు తగ్గట్లుగానే మా మూడు దేశాల ఉమ్మడి పెట్టుబడులతో ఈ పోర్టు విశేష అభివృద్ధిని అందుకోగలదని ఆశిస్తున్నాను. అఫ్గానిస్తాన్, సెంట్రల్ ఆసియా, ఐరోపా దేశాలకు, భారత్‌కు మధ్య ఈ మార్గం ద్వారా రాకపోకల జరపవచ్చు.’ అని అన్నారు.

chitram విలేఖరులతో మాట్లాడుతున్న మోదీ, రౌహని, ఘని