బిజినెస్

కొత్త గనులపై సింగరేణి దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, అక్టోబర్ 20: గోదావరి పరివాహక ప్రాంతంలోని కోల్‌బెల్టు ప్రాంతాలలో కొత్తగా సింగరేణి బొగ్గు గనులను ఏర్పాటు చేసేందుకు యాజమాన్యం దృష్టి సారించింది. ఇటీవల కార్మిక సంఘాలకు జరిగిన గుర్తింపు ఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్ పార్టీ అనుబంధ సంఘం జిజిబికెఎస్ విజయం సాధించింది. దాంతో ప్రభుత్వం సింగరేణి సంస్థ అభివృద్ధిపై ప్రత్యేక చొరవ తీసుకునేందుకు చర్యలు చేపట్టింది. ఎన్నికలకు ముందు కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు కొత్త బొగ్గుగనుల ఏర్పాటుతో సంస్థను అభివృద్ధి చేయడం తెలంగాణ కోల్‌బెల్ట్ ప్రాంతాలలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే యోచనలో తెలంగాణ సర్కారు ఉంది. అందులో భాగంగానే కొత్త మైన్ ఏర్పాటు విషయంలో యాజమాన్యానికి ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
ఆదిలాబాద్, కరీంనగర్, భూపాలపల్లి, మంచిర్యాల, కొత్తగూడెం, ఖమ్మం ఆరుజిల్లాల పరిధిలో ఉన్న సింగరేణి ప్రాంతాలలో ఏడు భూగర్భగనులు, 10కి పైగా ఓపెన్‌కాస్ట్ మైన్‌లను ఏర్పాటు చేసేందుకు సింగరేణి యాజమాన్యం ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. కొత్తగూడెం జిల్లాలోని కాచనపల్లి, మణుగూరు, కోయగూడెం, ఇల్లెందు ఏరియాల్లో మూడు భూగర్భ బొగ్గుగనులు, మరో నాలుగు ఓపెన్‌కాస్ట్ మైన్‌లను ఏర్పాటు చేసే యోచనలో యాజమాన్యం ఉంది. కాచనపల్లి ప్రాంతంతో పాటు మరికొన్ని ఏరియాల్లో బొగ్గుగనులు ఏర్పాటు చేసేందుకు అటవీశాఖ అనుమతులు తీసుకోవాల్సి ఉంది. పర్యావరణానికి ఆటంకం లేకుండా భూగర్భ బొగ్గు గనులను అధికంగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓపెన్‌కాస్ట్ మైన్‌ల వలన ఖర్చు తక్కువ కావడమే కాకుండా ఆదాయం అధికంగా వస్తుంది. ఒక్కో గనిలో రెండువేల మందికి పైగా కార్మికులు పనిచేసే వీలు ఉంటున్నందున ఆ దిశలోనే భూగర్భ గనులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తొలుతగా కోల్‌బెల్ట్ ప్రాంతాల్లో బొగ్గు నిక్షేపాలు ఉన్న పరిసరాల్లో సర్వేలు నిర్వహించినందున భూగర్భ బొగ్గుగనులు ఏర్పాటు చేసేందుకే యాజమాన్యం మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. మలిదశలో ఓపెన్‌కాస్ట్ ఏర్పాటుపై దృష్టిపెట్టే అవకాశం ఉంది. కొత్త బొగ్గుగనుల ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన జరిగే విధంగా కార్యచరణ కొనసాగిస్తున్నారు. ఏదిఏమైనా కార్మిక వర్గానికి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో సింగరేణి యాజమాన్యం ముందడుగు వేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఆరు నూతన ప్రాజెక్టుల ఏర్పాటుకు రంగం సిద్ధం
కొత్తగూడెం: సింగరేణి కాలరీస్ సంస్థలో ఆరు నూతన ప్రాజెక్టుల ఏర్పాటుకు యాజమాన్యం రంగం సిద్దం చేసింది. నిరుద్యోగ యువకులకు ఉపాది అవకాశాలు కల్పించే లక్ష్యంతో భూగర్భ గనుల ఏర్పాటుపై యాజమాన్యం దృష్టి సారించించింది. తెలంగాణా ప్రాంతంలోని ఆరు జిల్లాలలో విస్తరించి ఉన్న సింగరేణిలో ఆరు ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుమతులు లభించాయి. నూతన ప్రాజెక్టులకు సంబంధించిన పర్యావరణ, అటవీశాఖ అనుమతులను సంస్థ తీసుకుంది. దీంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కెటికె లాంగ్‌వాల్, కెటికె 5 ఇంక్లైన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రాంపురం, కొండాపురం, మంచిర్యాల జిల్లాలోని మందమర్రి కెకె 6, ఖాజీపేట 2 మైన్లను ఏర్పాటు చేయనున్నట్లు సింగరేణి కాలరీస్ డైరెక్టర్ ఆపరేషన్స్ చంద్రశేఖర్ శుక్రవారం తెలిపారు.