బిజినెస్

జిఎస్‌టి రిటర్న్‌లు 33 లక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: శుక్రవారం మధ్యాహ్నం వరకు సెప్టెంబర్ నెలకు సంబంధించిన 33 లక్షల వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) రిటర్న్‌లు దాఖలయ్యాయని, జిఎస్‌టిఎన్ పోర్టల్‌లో గంటకు 75వేల విక్రయాల డాటా అప్‌లోడ్ అయిందని ఆ కంపెనీ చైర్మన్ అజయ్ భూషణ్ పాండే తెలిపారు. జిఎస్‌టిలో భాగంగా సెప్టెంబర్ నెలకు సంబంధించిన జిఎస్‌టిఆర్-3బి ఇనిషియల్ రిటర్న్‌ల దాఖలుకు గడువు శుక్రవారం అర్ధరాత్రితో ముగుస్తోంది. జిఎస్‌టిఎన్ (వస్తు, సేవల పన్ను నెట్‌వర్క్) సిస్టం ఎలాంటి అంతరాయాలు లేకుండా నిలకడగా సాగుతోందని, దాని సామర్థ్యంలో 30 శాతం మేరకే డాటా అందుతోందని, గత రెండు రోజుల్లో 20 లక్షల రిటర్న్‌లు దాఖలయ్యాయని పాండే వివరించారు. ‘శుక్రవారం మధ్యాహ్నం వరకు 33 లక్షల రిటర్న్‌లు దాఖలయ్యాయి. గంటకు 75వేల రిటర్న్‌లు దాఖలవుతున్నాయి. జిఎస్‌టిఎన్ సిస్టం బాగా పనిచేస్తోంది. గడవులోగా మరింత మంది రిటర్న్‌లు దాఖలు చేస్తారని ఆశిస్తున్నాం’ అని పాండే శుక్రవారం ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. జూలై ఒకటో తేదీ నుంచి జిఎస్‌టి అమలులోకి వచ్చింది. మూడు నెలలు అయిపోయింది. వ్యాపారులు సెప్టెంబర్ నెలలో జరిగిన విక్రయాల వివరాలను వెల్లడిస్తూ జిఎస్‌టిఆర్-3బి రిటర్న్‌లు దాఖలు చేయాల్సి ఉంది. జూలైలో రూ. 95వేల కోట్ల ఆదాయానికి సంబంధించి 55.68 లక్షల రిటర్న్‌లు, ఆగస్టులో రూ. 92వేల కోట్ల ఆదాయానికి సంబంధించి 50 లక్షల రిటర్న్‌లు దాఖలయ్యాయి. మొదటి రెండు నెలలకు సంబంధించిన వ్యాపారానికి సంబంధించిన కొన్ని రిటర్న్‌లు గడువు ముగిసిన తరువాత కూడా అప్‌లోడ్ చేశారని, అందువల్ల సెప్టెంబర్ నెలకు సంబంధించిన రిటర్న్‌ల సంఖ్య ఎక్కువ ఉంటుందని పాండే పేర్కొన్నారు.
జిఎస్‌టి రిటర్న్‌ల దాఖలుకు చివరి నిముషం వరకు వేచిచూడకుండా గడువుకు ముందే పూర్తి చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గత నెలలో వ్యాపారులను కోరారు. ఒక నెలకు సంబంధించిన జిఎస్‌టిఆర్-3బి రిటర్న్‌లను మరుసటి నెల 20వ తేదిలోపు దాఖలు చేయాల్సి ఉంటుంది. అంటే సెప్టెంబర్ నెల రిటర్న్‌లు అక్టోబర్ 20వ తేది లోపు దాఖలు చేయాలి. అయితే జూలై నెలకు సంబంధించిన జిఎస్‌టిఆర్-3బి రిటర్న్‌లు దాఖలు చేసే సమయంలో జిఎస్‌టి నెట్‌వర్క్‌లో అవాంతరాలు ఎదురయిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం వీటి దాఖలుకు గడువును పెంచడంతో పాటు ఆలస్యం అయినందుకు చెల్లించాల్సిన అపరాధ రుసుము చెల్లించకుండా మినహాయింపు ఇచ్చింది. ఆగస్టు నెల రిటర్న్‌లు దాఖలు చేసే సమయానికి జిఎస్‌టి నెట్‌వర్క్ బాగయింది.