బిజినెస్

‘ఆది’లోనే హంసపాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 20: హిందూ సంవత్ (సంవత్సరం) 2074 ప్రారంభాన్ని పురస్కరించుకొని గురువారం సాయంత్రం గంట సేపు ప్రత్యేకంగా నిర్వహించిన ముహూరత్ ట్రేడింగ్ సెషన్‌లో స్టాక్ మార్కెట్లు పడిపోయాయి. బిఎస్‌ఇ సెనె్సక్స్ సెషన్ ప్రారంభంలో పుంజుకున్నప్పటికీ, తరువాత పడిపోయి సెషన్ చివరలో 194 పాయింట్లు కోల్పోయి 32,389.96 పాయింట్లకు దిగజారింది. హిందూ సంవత్ ప్రారంభ సెషన్‌లో మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లు బాగా పడిపోయాయని బ్రోకర్లు తెలిపారు. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ కూడా ఈ ముహురత్ ట్రేడింగ్ సెషన్‌లో 10,200 మార్కుకన్నా కిందికి పడిపోయింది. ముహూరత్ ట్రేడింగ్ సెషన్‌లో బిఎస్‌ఇ సెనె్సక్స్ అధిక స్థాయిలో 32,656.75 పాయింట్లతో ప్రారంభమయింది. సంవత్ 2074 ప్రారంభ సెషన్ కావడంతో మదుపరులు, ఫండ్స్ కొత్త ఖాతాలను తెరవడం వల్ల షేర్లలో కొనుగోళ్లు బాగా జరిగాయి. దీంతో సెనె్సక్స్ 32,663.06 పాయింట్లకు పెరిగింది. అయితే ఇది ఎంతో సేపు నిలువలేదు. మదుపరులు లాభాల స్వీకరణ కోసం అమ్మకాలకు పూనుకోవడంతో సెనె్సక్స్ ఒక్కసారిగా 32,319.37 పాయింట్లకు దిగజారింది. అయితే చివరలో స్వల్పంగా పుంజుకొని క్రితం సెషన్ ముగింపుతో పోలిస్తే 194.39 పాయింట్లు (0.60 శాతం) తగ్గి, 32,389.96 పాయింట్ల వద్ద ముగిసింది. అదే మాదిరిగా, ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ కూడా గురువారం నాటి ముహురత్ ట్రేడింగ్ సెషన్‌లో 10,211.95- 10,123.35 పాయింట్ల మధ్య కదలాడి చివరకు 64.30 పాయింట్లు (0.63 శాతం) తగ్గి, 10,146.55 పాయింట్లతో ముగిసింది. నిరుడు హిందూ సంవత్ 2073 ప్రారంభ సెషన్‌లో బిఎస్‌ఇ సెనె్సక్స్ 4,642.84 పాయింట్లు (16.61 శాతం), ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 1,572.85 పాయింట్లు (18.20 శాతం) పుంజుకున్నాయి. గురువారం నాటి ముహురత్ ట్రేడింగ్ సెషన్‌లో బ్యాంకింగ్, మెటల్, ప్రభుత్వ రంగ సంస్థలు, వౌలిక సదుపాయాలు, విద్యుత్, చమురు- వాయువు, ఆటో, కన్జ్యూమర్ డ్యూరేబుల్స్, ఆరోగ్య సంరక్షణ, రియల్టీ, ఎఫ్‌ఎంసిజి, ఐటి రంగాల షేర్లు నష్టపోయాయి.

చిత్రం..ముహూరత్ ట్రేడింగ్ సెషన్‌లో పాల్గొన్న బ్రోకర్లు