బిజినెస్

సాగర్ పర్యాటకులకు ఫారెస్ట్ వ్యూపాయింట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, అక్టోబర్ 21: నాగార్జునసాగర్‌ను సందర్శించే పర్యాటకుల కోసం అటవీ శాఖ మరో సౌకర్యాన్ని సందర్శకులకు శనివారం నుండి అందుబాటులోకి తెచ్చింది. నాగార్జునసాగర్ అటవీ అందాలు, జలాశయ అందాలను వీక్షించే విధంగా పర్యాటకులు వ్యూపాయింట్‌కు చేరుకుని అక్కడి నుండి సాగర్ అందాలను చూసేవిధంగా రూ.3.70 లక్షల వ్యయంతో వ్యూపాయింట్, వాచ్‌టవర్‌ను నిర్మాణం చేసింది. దీనిని శనివారం ఎపిసిఎఫ్ మోహన్‌చంద్ర పరిగిన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగర్‌ను సందర్శించే పర్యాటకులకు సౌకర్యవంతంగా సాగర్ సహజ అటవీ అందాలు, సాగర్ బ్యాక్ వాటర్‌ను ఒకేసారి వీక్షించేవిధంగా నెల్లికల్ అటవీ విభాగంలో ఈ వ్యూపాయింట్‌ను ప్రారంభించామన్నారు. వారం రోజుల క్రితం శ్రీశైలం దగ్గర ఈవిధంగానే తెలంగాణ అటవీ శాఖ ఆక్టోపస్ వ్యూపాయింట్‌ను ప్రారంభించిందన్నారు. ఎకోటూరిజంలో భాగంగా అటవీ శాఖ హైదరాబాద్-నాగార్జునసాగర్ రోడ్డులో సాగర్‌కు చేరుకోవడానికి 5 కి.మీ ముందే నెల్లికల్ అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ వాచ్ టవర్ ద్వారా పచ్చని సాగర్ అందాలను పర్యాటకులు చూసి ఎంతో ఆహ్లాదానికి గురవుతారన్నారు. ప్రారంభించినరోజే పర్యాటకులు ఈ వాచ్‌టవర్ ఎక్కి సాగర్ అందాలను చూసి ముగ్ధులైనట్లు తెలిపారు. ఈ ప్రాంతంలోనే 200 మీటర్ల వాచింగ్ ట్రాక్‌ను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఈ వాచ్‌టవర్ ద్వారా జంతువుల కదలికలను, కృష్ణానదిని వీక్షించే వెసులుబాటు ఉంటుందన్నారు. ఎండాకాలం సమయంలో అడవిలో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ఈ టవర్ పైనుండి గమనించి వెంటనే ఆ ప్రాంతానికి చేరుకునే విధంగా ఏర్పాటు చేసామన్నారు. రానున్న రోజుల్లో సాగర్ పర్యాటకులకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి తెస్తామన్నారు. కార్యక్రమంలో ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ గోపి రవి, రేంజర్ భవానిశంకర్, సెక్షన్ ఆఫీసర్‌లు సేవాలాల్, బీట్ ఆఫీసర్లు అన్నపూర్ణ పాల్గొన్నారు.

చిత్రాలు.. వాచ్ టవర్‌ను ప్రారంభిస్తున్న ఎపిసిసిఎఫ్ పరిగిన్
*వాచ్ టవర్ పైనుండి సాగర్ అందాలు