బిజినెస్

గోల్డ్ బాండ్లు రేపటినుంచే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: కేంద్ర ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్‌జిబి) ధరను ఒక గ్రాముకు రూ. 2,971గా నిర్ణయించింది. ప్రజలు ఈ బాండ్ల కొనుగోలుకు దరఖాస్తు చేసుకునేందుకు వ్యవధిని ఈ నెల 23నుంచి 25వరకు ఖరారు చేసింది. ఈ దరఖాస్తులను పరిశీలించి, ఈ నెల 30న కొనుగోళ్లను నిర్ధారించడం జరుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సంవత్సరం డిసెంబర్ వరకు 12 వారాల పాటు కొనసాగుతుందని ఇదివరకే ప్రకటించిన ఎస్‌జిబి క్యాలెండర్‌లో భాగంగా ప్రభుత్వం ఎస్‌జిబి ధరను నిర్ణయించింది. క్యాలెండర్ సంవత్సరం ప్రకారం, ప్రతి వారంలో సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజుల పాటు ప్రజలు ఈ బాండ్ల కొనుగోలు కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తారు. అక్టోబర్ తొమ్మిదిన మొదలయిన ఈ క్యాలెండర్ సంవత్సరం డిసెంబర్ 27వరకు కొనసాగుతుంది.
ఇందులో మొదటి సబ్‌స్క్రిప్షన్ అక్టోబర్ 11న ముగిసింది. ప్రతి వారంలో మూడు రోజుల పాటు వచ్చిన దరఖాస్తులకు సంబంధించిన కొనుగోళ్లను తదుపరి వారం మొదటి పనిదినం రోజున నిర్ధారిస్తారు.
భారత ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకుతో సంప్రదింపులు జరిపి, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని, డిజిటల్ పద్ధతిలో చెల్లింపులు జరిపే మదుపరులకు ఇష్యూ ధరలో ఒక్కో గ్రాముకు రూ. 50 చొప్పున డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అంటే ఇలాంటి మదుపరులకు ఒక్కో గ్రాముకు రూ. 2,921 చొప్పున గోల్డ్ బాండ్ లభిస్తుంది. ఈ పథకం కింద బాండ్లను ఒక గ్రాము ప్రమాణాలలో పేర్కొంటారు. ఈ పథకం కింద ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ నుంచి మార్చి వరకు)లో కనీసం ఒక్క గ్రాముకు, గరిష్ఠంగా 500 గ్రాముల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం కింద మొత్తంగా ఒక వ్యక్తి కాని అవిభాజ్య హిందూ కుటుంబం (హెచ్‌యుఎఫ్) కాని గరిష్ఠంగా 4 కిలోల వరకు గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. అలాగే ట్రస్టులు, ఇతర సంస్థలు గరిష్ఠంగా 20 కిలోల వరకు బాండ్లను కొనుగోలు చేయడానికి వీలుంటుంది.