బిజినెస్

ఎయిర్ సెల్ కాంబో 123

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 23: నగదుకు తగినట్టుగా పూర్తి విలువ కలిగిన ఉత్పత్తులు, సేవలను అందించాలనే లక్ష్యంతో ఎయిర్‌సెల్ మరో నూతన ప్రోడక్ట్.. కాంబో 123ను ఆవిష్కరించింది. అపరిమిత ప్రయోజనాలను ఈ కాంబో ఆఫర్ అందిస్తుంది. ఈ సంస్థ ఇప్పుడు 123 రూపాయల రీచార్జ్ కూపన్‌ను పరిచయం చేయగా, అపరిమిత కాలింగ్, డాటా (మొదటి 500 ఎంబికు హైస్పీడ్)ను రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అందిస్తుందని ఎయిర్‌సెల్ మార్కెటింగ్ ముఖ్య అధికారి అనుపమ్ వాసుదేవ్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నూతన ప్రోడక్ట్ కాంబో 123 అసాధరణమైందని, మొబైల్ ఫోన్ నేడు అందిస్తున్న మూడు ప్రధాన సేవలైన వాయిస్, డాటా, వాస్‌ను అందిస్తుందని ఆయన వివరించారు. ఇది అందరికీ అందుబాటు ధరలో వినియోగదారులకు అందించాలన్నదే తమ లక్ష్యం అన్నారు. కాంబో 123ను ఎయిర్‌సెల్ అత్యున్నత కాస్ట్ ఎఫెక్టివ్ ప్రతిపాదనలలో భాగంగా మార్కెట్‌లో వినియోదారుల డిమాండ్, వారి అవసరాలను తెలుసుకొని విడుదల చేశామన్నారు.