బిజినెస్

వ్యవసాయ, అనుబంధ రంగాల్లో 60 శాతం ఉపాధి పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, అక్టోబర్ 22: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఇజిఎస్)ను వ్యవసాయం, అనుబంధ రంగాలకు మరింత విస్తరింపజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో సుమారు 60 శాతం పనులు ఉపాధి హామీ పథకం కింద జరిగేలా చర్యలు తీసుకుంటోంది. దీంతో ఇక నుండి విధిగా వ్యవసాయ పనులకు ఉపాధి హామీ పథకం కింద పెద్దపీట వేయడానికి అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. మెట్ట, డెల్టా, కోనసీమ ప్రాంతాలతో పాటు గిరిజన ఆవాసాల్లో పెద్దఎత్తున ఉపాధి హామీ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఏజన్సీలో వాటర్ షెడ్స్, ఫామ్ పాండ్స్ నిర్మాణానికి పథకం కింద అధిక ప్రాధాన్యతనివ్వనున్నారు. తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీలోని 43 గ్రామ పంచాయతీల పరిధిలోని 300 నివాసిత ప్రాంతాల్లో వాటర్ షెడ్ పథకాలు నిర్మిస్తున్నారు. ఈ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయడంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఫామ్‌పాండ్స్, సాలిడ్‌వేస్ట్ మేనేజిమెంట్ పనులను ఉపాధి హామీ పథకం కింద విస్తృతంగా చేపట్టనున్నట్టు అధికారులు ప్రకటించారు. ఒకప్పుడు ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయ పనులను పరిమితంగానే చేపట్టిన ప్రభుత్వం ఇటీవలి కాలంలో చిన్న, సన్నకారు రైతుల సౌకర్యార్ధం పూర్తిస్థాయిలో వ్యవసాయ పనులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 100 రోజుల పని దినాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాగా తూర్పు గోదావరి జిల్లాలో ఇక నుండి ఉపాధి హామీ పనులను యువ ఐఎఎస్ అధికారులు పర్యవేక్షిస్తారు. జిల్లాలోని ట్రైనీ కలెక్టర్లు సహా యువ ఐఎస్‌ఎస్ అధికారులు ఈ బాధ్యత తీసుకున్నారు. ఏజన్సీ గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలకు వేతనాల చెల్లింపులో పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్య వైఖరి, సకాలంలో వేతనాలు చెల్లించకపోవడం, పనులు, పని దినాల కల్పనలో అలసత్వం, షెల్ప్‌లో తగిన పనులు అందుబాటులో ఉంచకపోవడం, క్షేత్రస్థాయిలో సిబ్బంది అవకతవకలు, విధి నిర్వహణలో అలసత్వం తదితర సమస్యలపై సదరు అధికారులు సమగ్రంగా విచారిస్తారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న వేతనాలను నవంబర్ 15వ తేదీలోగా కూలీల ఖాతాలకు జమచేయడంతో పాటు ఏజన్సీలో నేటికీ బ్యాంకు ఖాతాలు లేని లబ్ధిదారులను తక్షణం గుర్తించి, వారి ఖాతాలకే సొమ్ము జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.