బిజినెస్

సిద్దిపేటలో 200 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, అక్టోబర్ 22: సిద్దిపేటలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని, ఇందుకోసం 200 ఎకరాల స్థలాన్ని సిద్ధం చేస్తున్నట్లు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. పారిశ్రామిక ఖిల్లాగా సిద్దిపేటను ఏర్పాటు చేయనుండడంతో వేలాది మందికి, ఉద్యోగ, ఉపాధి లభించే అవకాశం ఉందన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రైస్ మిల్లర్స్ భవన్‌లో జరిగిన పరస్పర అభినందన (మూరత్) కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలో ములుగు వద్ద సీడ్ కంపెనీ, బెజ్జంకి వద్ద గ్రానైట్ పార్కు, దుద్దెడ వద్ద ఎలక్ట్రానిక్ పరికరాల పరిశ్రమను భారీ వ్యయంతో ఏర్పాటు చే స్తామన్నారు. నీరు, రైల్వే మార్గం, విద్యుత్ సౌకర్యం ఉంటే పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తారన్నారు. సిద్దిపేట పట్టణం చుట్టు విద్యుత్ గ్రిడ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రామగుండం నుండి సిద్దిపేటకు, కొడకండ్ల నుండి సిద్దిపేటకు కొట్లాది రూపాయలను వెచ్చించి ప్రత్యేక విద్యుత్ లైన్లను ఏర్పాటు చేశామన్నారు.

చిత్రం..సిద్దిపేటలో ఆదివారం జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీష్‌రావు