బిజినెస్

ఆనందావని.. ఆంధ్రప్రదేశ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 22: ఆంధ్రప్రదేశ్‌లో తాము ప్రజల సంతోష స్థాయినే కొలమానంగా తీసుకుని ఆనందమయ సమాజం కోసం పనిచేస్తున్నట్లు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. దుబాయిలో యుఎఇ హ్యాపీనెస్ అండ్ వెల్‌బీయింగ్ శాఖ మంత్రి ఉద్ బిన్ ఖల్ఫాన్ అల్ రౌమితో భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం ఆయన సమావేశమయ్యారు. తమ రాష్ట్రంలో ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఆనందపు వారాంతాలు, ఆనందలహరి, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుక, తదితర కార్యక్రమాలన్నీ అందులో భాగమేనని వివరించారు. ఇ-కార్యాలయాల ప్రవేశంతో ఉద్యోగుల పనిభారం గణనీయంగా తగ్గిపోయిందని చెప్పారు. ఉద్యోగులు ఆనందంగా, ఆహ్లాద వాతావరణంలో పనిచేయడానికి వీలుగా అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయమంతా ఏసీ సదుపాయం కల్పించామన్నారు. తమ కార్యాలయాలను క్రమంగా పని ఒత్తిడి లేని, సౌకర్యవంతమైన కార్యస్థానాలుగా మార్చుకుంటున్నట్టు చెప్పారు. తాము ఒక పద్ధతి ప్రకారం సంతోష సూచిక స్థాయిని పెంచుకుంటున్నామని, యుఎఇలో అమలు చేస్తున్న మేలిమి విధానాలను తప్పకుండా అనుసరించి మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించాలన్నది తమ ఉద్దేశమని చంద్రబాబు ఆమెకు వివరించారు. సమావేశానంతరం హ్యాపీనెస్ లేడీ మినిస్టర్‌తో కలిసి అక్కడి హ్యాపీనెస్ డిపార్ట్‌మెంట్‌లోని ఒక చిన్న కేంద్రాన్ని ముఖ్యమంత్రి సందర్శించారు. ఆ కేంద్రం ఎలా పనిచేస్తోందో ఎమిరేట్స్ హ్యాపీనెస్ మినిస్టర్ చంద్రబాబుకు తెలిపారు. ప్రభుత్వ శాఖలను ఎలా పర్యవేక్షిస్తున్నదీ, సంతోష స్థాయిని ప్రజల నుంచి ఎలా తెలుసుకుంటున్నదీ ఆమె వివరించారు.
ఇదిలావుంటే ప్రజల్లో సంతృప్తే పరిపాలనకు గీటురాయిగా భావిస్తూ యుఎఇ ప్రభుత్వం నెలకొల్పన హ్యాపీనెస్ మంత్రిత్వ శాఖ అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. సానుకూల దృక్పధాన్ని అలవరచి తద్వారా సంతోషాన్ని పెంపొందించేలా అక్కడి ప్రభుత్వ శాఖలు ఒక మాన్యువల్‌ను తు.చ.తప్పక అనుసరిస్తాయి. విద్యాసంస్థలు, కార్యాలయాల్లో ఈ శాఖ కార్యకలాపాలు ఉంటాయి. సంతోషం, సానుకూల దృక్పథం ధ్యేయంగా అక్కడి అధికారులకు అవసరమైన శిక్షణ అందిస్తారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి విధాన నిర్ణయం సంతోష సూచికను కొలమానంగా తీసుకుని చేయడం విశేషం.
ప్రజల సంతోషంపై ఆ విధానాలు ఎలాంటి ప్రభావాలు చూపుతాయనేది ముందుగానే పరిశీలించి ఆమేరకు విధాన నిర్ణయాలు ప్రకటిస్తారు. వినియోగదారులు, ప్రజలు సంతృప్తి చెందడానికే పరిమితం కాకుండా ఇప్పుడు వారు ప్రజల సంతోషమే పరమార్థంగా పనిచేస్తున్నారు. 2018 ఫిబ్రవరి 10న అక్కడి ప్రభుత్వం వరల్డ్ హ్యాపీనెస్ సదస్సును నిర్వహించనుంది. సమావేశంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి సాయిప్రసాద్, ఏపీ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు సిఈవో జాస్తి కృష్ణకిషోర్, తదితరులు పాల్గొన్నారు.
బిన్ జాయేద్ గ్రూప్‌తో ఎంవోయు
బిన్ జాయేద్ గ్రూపుతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. కీలక ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు నిధుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఏపీ ఈడిబీ, యుఏఈకి చెందిన బిన్ జాయేద్ ఇంటర్నేషనల్ సంస్థ అవగాహన ఒప్పంద పత్రాలను మార్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం మన రాష్ట్రంలో రెండు బిలియన్ డాలర్ల విలువైన వౌలిక సదుపాయాల ప్రాజెక్టుకు సంబంధించి బిన్ జాయేద్ ఇంటర్నేషనల్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తుంది. రహదారులు, పోర్టులు, ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి బిన్ జాయేద్ గ్రూపు పెట్టుబడులు పెడుతుంది. అమరావతిలో తలపెట్టిన మేజర్ ఆర్టీరియల్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్, విజయవాడ మెట్రోరైల్, రామాయపట్నం బహుళార్థ సాధక ఓడరేవు అభివృద్ధి, భోగాపురం నుంచి భీమునిపట్నం వరకు, విశాఖ నుంచి అడ్డారిపేట వరకు బీచ్ కారిడార్లు, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, తదితర ప్రాజెక్టుల అభివృద్ధికి పెట్టుబడులు తెస్తుంది. ఆయా ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వానికి బిన్ జాయేద్ గ్రూపు నేరుగా నిధులు అందించనుంది. అవగాహన ఒప్పంద పత్రాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పక్షాన ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు సిఈవో జాస్తి కృష్ణకిషోర్, బిన్ జాయెద్ ఇంటర్నేషనల్ ఎల్‌ఎల్‌సి తరపున ఆ సంస్థ ఎండి మిధాత్ కిద్వాయ్ సంతకాలు చేశారు.

చిత్రం..యుఎఇ ‘హ్యాపీనెస్ అండ్ వెల్‌బీయింగ్’ లేడీ మినిస్టర్ ఉద్ బిన్ ఖల్ఫాన్ అల్ రౌమితో కలిసి
ఓ హ్యాపీనెస్ కేంద్రాన్ని సందర్శిస్తున్న ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు, తదితరులు