బిజినెస్

సమగ్ర పరిశీలన అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: దేశంలో వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) విధానం దృఢంగా పాదుకొని పోయినందున చిన్న, మధ్య తరహా వ్యాపారులపై భారాన్ని తగ్గించడానికి ఇప్పుడు పన్ను రేట్లను సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా పేర్కొన్నారు. ఎక్సైజ్ సుంకం, సేవాపన్ను, విలువ ఆధారిత పన్ను (వ్యాట్) వంటి డజనుకు పైగా కేంద్ర, రాష్ట్ర పన్నులను కలిపి అమలు చేస్తున్న జిఎస్‌టి స్థిరపడటానికి సుమారు సంవత్సరం పడుతుందని ఆయన ఆదివారం ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. సుమారు నాలుగు నెలల క్రితం ప్రవేశపెట్టిన పరోక్ష పన్ను విధానం జిఎస్‌టి బాలారిష్టాలను, అంగీకార సమస్యలను ముందుకు తెచ్చింది. అయితే ఈ కొత్త విధానాన్ని అమలు చేయడానికి ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి నిర్ణాయక సంస్థ జిఎస్‌టి మండలి అనేకసార్లు ఈ కొత్త విధానంలో మార్పులు చేయడం ద్వారా ఈ సమస్యలను పరిష్కరించింది. పన్నుల చెల్లింపులో, జిఎస్‌టి రిటర్న్‌లను దాఖలు చేయడంలో చిన్న, మధ్య తరహా వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి, జిఎస్‌టిని పరిశ్రమలకు అనుకూలంగా తీర్చిదిద్దడానికి ఈ కొత్త విధానాన్ని అన్ని కోణాల్లో పరిశీలించి మార్పులు చేర్పులు చేశారు. జిఎస్‌టి మండలి వందకు పైగా సరుకుల పన్ను రేట్లను హేతుబద్ధీకరించడంతో పాటు ఎగుమతిదారుల రిఫండ్ ప్రక్రియను సులభతరం చేసింది. అయితే ‘జిఎస్‌టి రేట్లను సమగ్రంగా పరిశీలించ వలసిన అవసరం ఉంది. ఒకే చాప్టర్‌లోని కొన్ని వస్తువులను విభజించడానికి వీలుంది. చాప్టర్ల వారీగా వస్తువులను సమన్వయం చేయాల్సిన అవసరం ఉంది. మధ్య, చిన్న తరహా వ్యాపారులు, సామాన్య ప్రజలపై పెద్ద భారం పడినట్లు ఎక్కడయినా తేలితే, ఆ భారాలను తగ్గించడం ద్వారా కొత్త విధానానికి మరింత అంగీకారాన్ని పొందవచ్చు’ అని అధియా అన్నారు. జూలై ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చిన జిఎస్‌టి విధానంలో ఏయే సరుకుల పన్ను రేట్లను హేతుబద్ధీకరించాలనే అంశాన్ని ఫిట్‌మెంట్ కమిటీ నిర్ణయిస్తుంది. అయితే, ఈ ఫిట్‌మెంట్ కమిటీ చేసిన కొన్ని గణాంకాలను పునఃపరిశీలించ వలసిన అవసరం ఉందని అధియా అభిప్రాయపడ్డారు. ఈ ఫిట్‌మెంట్ కమిటీ వీలయినంత త్వరలో ఈ హేతుబద్ధీకరణకు సంబంధించి తన వాదనను జిఎస్‌టి మండలి దృష్టికి తీసికెళ్తుందని ఆయన పేర్కొన్నారు.