బిజినెస్

భారంగా మారిన ప్రాజెక్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: దేశంలో 331 వౌలిక సౌకర్యాల ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ. 1.72 లక్షల కోట్లు పెరిగింది. ప్రాజెక్టుల అమలులో జాప్యం సహా వివిధ కారణాల వల్ల వీటి అంచనా వ్యయం భారీగా పెరిగింది. ఈ ప్రాజెక్టులన్నీ ఒక్కో ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 150 కోట్లు లేదా అంతకన్నా ఎక్కువగా ఉన్నవేనని కేంద్ర ప్రభుత్వ నివేదిక ఒకటి వెల్లడించింది. రూ. 150 కోట్లు లేదా అంతకన్నా ఎక్కువ అంచనా వ్యయంతో చేపట్టిన వౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది. 1,257 ప్రాజెక్టుల ముందు నిర్ణయించిన మొత్తం అంచనా వ్యయం రూ. 15,76,903.56 కోట్లు. అయితే వీటిని పూర్తి చేయడానికి అయ్యే వ్యయం రూ. 17,49,274.62 కోట్లు అవుతుందని తాజా అంచనాల్లో తేలింది. అంటే వీటి అంచనా వ్యయం రూ. 1,72,371.06 కోట్లు పెరుగుతుంది. ముందు నిర్ణయించిన దానికన్నా 10.93 శాతం ఎక్కువ అవుతుందని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఈ సంవత్సరం జూలై నెలకు సంబంధించి విడుదల చేసిన తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. ఈ ప్రాజెక్టులపై ఈ సంవత్సరం జూలై వరకు చేసిన వ్యయం రూ. 6,80,016.96 కోట్లు. తాజాగా సవరించిన మొత్తం అంచనా వ్యయంలో ఇది 38.87 శాతం. ఈ 1,257 ప్రాజెక్టులలో 331 ప్రాజెక్టుల అంచనా వ్యయం భారీగా 274 శాతం పెరిగింది. ‘మొత్తం 1,257 ప్రాజెక్టుల్లో రెండు ప్రాజెక్టులు పూర్తయ్యాయి. పది కొత్త ప్రాజెక్టులు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ఈ సంవత్సరం జూలైలో ప్రారంభమయ్యాయి. ఈ మొత్తం ప్రాజెక్టుల్లో 11 ప్రాజెక్టుల పనులు ముందు నిర్ణయించిన దానికన్నా వేగంగా జరుగుతున్నాయి. 304 ప్రాజెక్టుల పనులు షెడ్యూలు ప్రకారం సాగుతున్నాయి. 274 ప్రాజెక్టుల పనుల్లో జాప్యం జరిగింది. 331 ప్రాజెక్టుల్లో అంచనా వ్యయం పెరిగింది. 92 ప్రాజెక్టుల్లో జాప్యం జరగడంతో పాటు అంచనా వ్యయం కూడా పెరిగింది’ అని గణాంకాల మంత్రిత్వ శాఖ నివేదిక తెలిపింది. అయితే, ప్రాజెక్టుల పూర్తికి తాజాగా సవరించిన షెడ్యూలు ప్రకారం చూస్తే జాప్యమైన ప్రాజెక్టుల సంఖ్య 215కు తగ్గిందని పేర్కొంది. 668 ప్రాజెక్టుల ముందు నిర్ణయించిన ప్రారంభ తేదీలను, అవి వాస్తవానికి మొదలయిన తేదీలను సంబంధిత అధికారులు తెలియజేయలేదని ఈ నివేదిక పేర్కొంది.