బిజినెస్

సర్కారు చర్యలే మాంద్యానికి విరుగుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: భారత ఆర్థిక వ్యవస్థలో మాంద్యం అట్టడుగు స్థాయికి చేరుకుందని, అయితే అది ఎంత వేగంగా కోలుకుంటుందనేది ప్రభుత్వం ఇప్పటి నుంచి తీసుకునే చర్యల మీద కీలకంగా ఆధారపడి ఉందని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ నివేదిక ఒకటి పేర్కొంది. పెద్ద నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)ను ప్రవేశపెట్టడం వంటి వ్యవస్థీకృత సంస్కరణల అమలు ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపినప్పటికీ, ఇటీవలి కాలంలో కొన్ని ప్రమాణాల పరంగా మెరుగుదల కనిపిస్తోందని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ తాజా ఎకానమి అబ్జర్వర్ ఇండెక్స్ వివరించింది. ‘్భరత ఆర్థిక వ్యవస్థలో మాంద్యం అట్టడుగు స్థాయికి చేరిందని మేము విశ్వసిస్తున్నాం. అయితే, ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకునే వేగం, స్థితి అనేది ప్రభుత్వం ఇప్పటి నుంచి వృద్ధి రేటులో చలనం తీసుకు రావడానికి చేపట్టే చర్యల మీద కీలకంగా ఆధారపడి ఉంది. ప్రత్యేకంగా ప్రైవేటు రంగంలో పెట్టుబడులు అనేవి ముఖ్యమైనవి. ప్రైవేటు రంగంలో పెట్టుబడులు పెరగకుండా ఆశించిన స్థాయిలో వృద్ధి రేటును సాధించజాలం’ అని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ ఇండియా ప్రధాన ఆర్థికవేత్త అరుణ్ సింగ్ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థపై నోట్ల రద్దు, జిఎస్‌టి వంటి వ్యవస్థీకృత సంస్కరణల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని అంచనా వేసినప్పటికీ, ఖచ్చితంగా ఎంత పరిమాణంలో ఉంటుందనేది అంచనా వేయలేదని ఆయన పేర్కొన్నారు.
‘ఇటీవలి కాలంలో కొన్ని ప్రమాణాల రీత్యా ఆర్థిక వ్యవస్థలో మెరుగుదల ఉంది. పారిశ్రామిక ఉత్పత్తి ప్రత్యేకించి ఉత్పాదక వస్తువులు తిరిగి పుంజుకోవడానికి కేవలం పండుగల సీజన్ వల్ల ఏర్పడిన డిమాండ్ కారణం కాదు. దానికి స్థిరమైన, సహజమైన ప్రాతిపదిక ఉందని విశ్వసిస్తున్నాం’ అని సింగ్ పేర్కొన్నారు. ఎగుమతుల్లో పురోగతి, మిత వడ్డీ రేట్లు, అల్ప ద్రవ్యోల్బణం రేటు, వాణిజ్య లోటు నియంత్రణ, తగిన పరిమాణంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) రావడం, ఆర్థిక క్రమశిక్షణ దిశగా ప్రభుత్వం తీసుకునే చర్యలు వంటివి ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఉన్న దశ నుంచి ప్రబల వేగంతో పుంజుకోవడానికి మార్గం సుగమం చేస్తుందని ఆ నివేదిక పేర్కొంది.