బిజినెస్

తక్షణమే రాజన్‌ను తొలగించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 26: రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్‌పై బిజెపి ఎంపి సుబ్రహ్మణ్యస్వామి గురువారం మరోసారి విరుచుకుపడ్డారు. భారత్‌కు సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారాన్ని ప్రపంచంలోని తన సన్నిహితులకు చేరవేస్తున్నారన్న ఆరోపణతో సహా రాజన్‌పై ఆరు ఆరోపణలు చేసిన స్వామి ఆయనను పదవినుంచి తక్షణమే తొలగించాలని ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో డిమాండ్ చేశారు. వడ్డీ రేట్లను పెంచడం, అధిక వడ్డీ రేట్ల పరిణామాలు ఏమిటో రాజన్‌కు బాగా తెలుసునన్న స్వామి ఆయన ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేస్తున్నారని, అది దేశ ప్రయోజనాలకు వ్యతిరేకమైందని అన్నారు. దేశీయ పరిశ్రమలపై బలవంతంగా మాంద్యాన్ని రుద్దడం కోసమే రాజన్ వడ్డీ రేట్లను పెంచుతున్నారని, ప్రభుత్వ ఉన్నత పదవులో ఉన్నప్పటికీ ఆయన తన అమెరికా గ్రీన్‌కార్డును కొనసాగిస్తున్నారని, దాన్ని రెన్యువల్ చేయించుకోవడం కోసమే ఏడాదికోసారి అమెరికా వెళ్లి వస్తున్నారని, చికాగోలోని తన వ్యక్తిగత అన్ సెక్యూర్డ్ ఇ-మెయిల్ అడ్రసుపై ప్రపంచవ్యాప్తంగా తనకు సన్నిహితులైన అనేక మందికి మన ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని అందజేస్తున్నారని, అంతేకాక బిజెపి ప్రభుత్వాన్ని చులకన చేస్తున్నారని ప్రధానికి రాసిన తాజా లేఖలో స్వామి ఆరోపించారు.
ఆర్‌బిఐ గవర్నర్ పదవి అంటే ఎంతో ఉన్నతమైనదని, దాన్ని నిర్వహించే వ్యక్తి షరతులు లేని దేశ భక్తి, అంకిత భావం, నిబద్ధతను ప్రదర్శించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా ఆధిపత్యాన్ని కాపాడే ‘గ్రూప్ ఆఫ్ 30’లో రాజన్ సభ్యుడని కూడా సుబ్రహ్మణ్యం స్వామి ఆరోపించారు. అమెరికా ఆధిపత్యం కారణంగా జపాన్, తూర్పు ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థలు ఎలా కుప్పకూలిపోయాయో గుర్తు చేసిన స్వామి అధిక వడ్డీ రేట్లతో దేశంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఉసురు తీసే రాజన్ విధానంలో సైతం అదే కనిపిస్తోందని ఆరోపించారు. ఈ నెల 17న ప్రధాని మోదీకి రాసిన తొలి లేఖలో స్వామి రాజన్‌ను మానసికంగా సంపూర్ణ భారతీయుడిగా కనిపించడం లేదని ఆరోపించిన విషయం తెలిసిందే.